గ్రహం అనుగ్రహం, సోమవారం, జూన్ 1, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, సోమవారం, జూన్ 1, 2015

Published Mon, Jun 1 2015 1:36 AM

గ్రహం అనుగ్రహం, సోమవారం, జూన్  1, 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి శు.చతుర్దశి రా.9.15 వరకు
నక్షత్రం విశాఖ రా.6.55 వరకు
వర్జ్యం రా.11.04 నుంచి 12.44 వరకు
దుర్ముహూర్తం ప.12.23 నుంచి 1.13 వరకు
తదుపరి ప.3.00 నుంచి 3.50 వరకు
అమృతఘడియలు ఉ.9.34 నుంచి 10.13 వరకు
సూర్యోదయం:    5.28 సూర్యాస్తమయం:   6.26
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 మేషం: పనులు చకచకా పూర్తి కాగలవు.  ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

 వృషభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

 మిథునం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

 కర్కాటకం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతాయి.

 సింహం: బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి, ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

 కన్య: బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో గందరగోళం.

 తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ అంచనాలు నిజం కాగలవు. వస్తులాభాలు. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

 వృశ్చికం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ.

 ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

 మకరం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

 కుంభం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

 మీనం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement