గ్రహం అనుగ్రహం,శనివారం 25, ఏప్రిల్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం,శనివారం 25, ఏప్రిల్ 2015

Published Sat, Apr 25 2015 2:36 AM

Anugraham of the day on saturday 25, April , 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి శు.సప్తమి రా.7.10 వరకు
నక్షత్రం పునర్వసు సా.4.17 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం రా.12.47 నుంచి 2.29 వరకు
దుర్ముహూర్తం ఉ.5.43 నుంచి 7.23 వరకు
అమృతఘడియలు ప.11.19 నుంచి 1.02 వరకు
 
సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం:     6.14
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం:
ప.1.30 నుంచి
3.00 వరకు

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి.

వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మిథునం: మిత్రులతో మాట పట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో గందరగోళం.

కర్కాటకం: విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 సింహం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

కన్య: ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధన, వ స్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: బంధువుల సహాయం అందుతుంది. కార్యసిద్ధి. పరపతి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: రాబడి తగ్గి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందువినోదాలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందువినోదాలు. కార్యజయం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

- సింహంభట్ల సుబ్బారావు
 
 
 
 

Advertisement
Advertisement