ఏపీలో పాలనా శూన్యత | Sakshi
Sakshi News home page

ఏపీలో పాలనా శూన్యత

Published Fri, Aug 7 2015 1:09 AM

ఏపీలో పాలనా శూన్యత - Sakshi

పాలనా దురంధరుడనని పదేపదే చాటుకునే సీఎం చంద్రబాబుకు మొత్తంగా పరిపాల నపైనే పట్టు సడలిపోవడం ఆశ్చర్యం. జవాబుదారీతనం లేక, ప్రజల పరిస్థితి దిక్కూ దివాణం లేనట్లుగా మారింది. రాష్ట్రంలో భయంకరమైన పాలనా శూన్యత ఏర్పడింది.
 
 వాస్తవాలు కటువుగా, చేదుగా ఉంటాయి. కాని వాటిని దిగమిం గాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణంగా పరిపాల నా శూన్యత ఏర్పడిందన్నది ఓ కఠోర వాస్తవం. కళ్లముందు కనిపి స్తున్న కొన్ని అంశాల్ని విశ్లేషిస్తే, తరచి చూస్తే, హేతబద్ధంగా విచా రిస్తే నిజానిజాలు అర్ధమవుతాయి. ఎంతమంది దృష్టిని ఈ వార్త ఆకర్షించిందో తెలియదు గానీ... హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో.. దాదాపు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైం ది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సర్కిళ్లలో పనిచేసే అధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేశా రు. అయోమయంలో ఉన్న విద్యార్థుల వెతలను; జీతాలు రాని అధ్యాపకుల కడగండ్లను  మీడియా తన వంతు ధర్మం గా అందరి దృష్టికి తెచ్చింది.
 
 ఇందులో పెద్ద విశేషం ఏముంది? అని కొందరికి సందే హం కలగవచ్చు. అసలు విశేషం ఏమంటే - సదరు బాధిత విద్యార్థుల, అధ్యాపకుల వేదనను గుర్తించిన హైకోర్టు.. ఆ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆ విద్యార్థుల ప్రవేశాల ను ఏ చట్టాల ప్రకారం నిలిపివేశారో తెలియజేయాలంటూ వర్సిటీ తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ఈ వార్త ఇంతటితో ముగియలేదు. హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించిన దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్ర దేశ్ విద్యాశాఖామంత్రి గౌరవ గవర్నర్ గారిని కలసి.. అం బేడ్కర్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌గారు జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్టు సుమోటోగా కేసు స్వీకరించేవరకూ ఇంత ప్రధానమైన అంశం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించలేకపోయింది.
 
 ఇలాంటిదే మరొకటి.. వైద్య ఆరోగ్యశాఖామంత్రి సొం త జిల్లాలోని కొత్తమాజేరు గ్రామంలో రెండు నెలల వ్యవధి లో అంతుపట్టని వ్యాధితో 18 మంది చనిపోయిన సంఘట న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించే వరకూ ప్రభుత్వం మేలుకోలేకపోయింది. ఇక.. రాష్ట్ర రైతాంగం పరిస్థితి చెప్పనలని కానట్లుగా ఉంది. ఇంకా కొన్ని చోట్ల సాగు మొదలు కాలేదు. సంబంధించి ఇరి గేషన్ మంత్రిగాని, వ్యవసాయ మంత్రిగానీ.. రాష్ట్ర రైతాంగా నికి ఎలాంటి భరోసా ఇచ్చినట్లు కన్పించలేదు.
 
 ‘ఓటుకు కోట్లు’గా పేరుపడిన కేసులో దాదాపు నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘శ్లేష్మంలో పడ్డ ఈగ’లా పడి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎప్పుడు ఏం జరుగు తుందోనన్న ఉత్కంఠ అధికార పార్టీలో, అధికార వర్గాల్లో నెలకొంది. ఆ నెలరోజులు రాష్ట్రంలో పరిపాలన అటకె క్కింది. ఆ తర్వాత పుష్కరాలొచ్చాయి. తొలిరోజున జరిగిన అపశ్రుతి వల్ల మూటగట్టుకున్న అప్రదిష్ట నుండి బయటప డడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే మకాం వేశారు. మిగిలిన రోజుల్లో అర్ధరాత్రి వరకు మేలుకొని... ఘాట్లను సందర్శిస్తూ; అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ.. మొ త్తానికి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామంటూ తమకు తామే అభినందించుకొని.. బీజేపీ బాబా రాందేవ్ లాంటి వారిని ముగింపు వేడుకకు ఆహ్వానించి కితాబు లిప్పించుకొన్నారు.
 
  పుష్కరాల్లో ఖర్చుపెట్టిన రూ.1,600 కోట్ల లెక్కల గురించిగానీ, తొలిరోజు జరిగిన ఘటనపై వేస్తామ న్న విచారణ కమిటీ గురిం చి అతీగతీ లేదు. పుష్కరాలు ముగి సిన వెంటనే హైదరాబాద్ చేరుకొన్న చంద్రబాబు రాష్ట్ర క్యాబినెట్‌తో భేటీ అయ్యారు. 12 గంటల సుదీర్ఘ సమావేశం. చర్చించిన అంశాలు చూస్తే ఆశ్చర్యం! వానల్లేక దుర్భిక్ష పరిస్థితులు ఎదురై ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతుల దయనీయ స్థితిగతుల గురించి లేదా వలసబాట పట్టిన కూలీజనం గురించిన చర్చేలేదు. ఇక్కడ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంలోనే లోక్ సభలో... ఓ ప్రశ్నకు ‘ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవ కాశం లేదు’ అనే సమాధానం రాత పూర్వకంగా వచ్చింది. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇంత కీలకమైన అంశాన్ని ‘కేబినెట్’ చాలా తేలిగ్గా తీసు కొంది. ‘అబ్బే.. ఇది మనకు సంబంధించింది కాదు.. మన రాష్ట్రం ప్రస్తావన ఎక్కడుంది?’ అంటూ ఆర్థిక మంత్రివర్యు లు మీడియా సమావేశంలో చప్పరించేశారు.
 
 కేబినెట్ ముగిసిన మరునాడు విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచి కూడా  చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ నేతలకు,  రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వలేదు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే తప్పదు’ అంటూ ఓ ప్రకటన  చేసి ఆ సాయం త్రమే వారం రోజుల విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.
 
 నిజానికి .. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ 15 మాసాల్లో మంత్రివర్గం ఉమ్మడిగా పని చేస్తున్న భావన ఏ సందర్భంలోనూ కలగలేదు. విదేశీ పర్యటనలు, రాజధాని నిర్మాణానికి భూసేకరణ పనులు మొదలైన వాటిల్లోనే ముఖ్యమంత్రి తీరుబడి లేనట్లుగా కన్పించారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని చెప్పి సెక్రటేరియెట్ వద్ద హుండీలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తూ.. మరోవైపు  ప్రత్యేక విమానాల్లో విదేశీపర్యటనలు సాగించడం, విచ్చల విడిగా ప్రజాధనాన్ని దుబారా చేయడం వంటి చర్యలతో సీఎం ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టుకోవడం మొదలైంది.
 
చంద్రబాబుకున్న సమస్యలు రాష్ట్ర సమస్యలు కాదు. కొన్ని తనంతట తానుగా సృష్టించుకున్నవి. తన చుట్టూ ఉన్న కార్పొరేట్ లాబీ ప్రయోజనాల కోసం, అందులో ఆర్థిక నేరా ల ఆరోపణల్లో చిక్కుకున్న ఒకరిద్దరికి పదవులు ఇప్పించుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడ్డారు. దానికి తోడు ఓటుకు కోట్లు కేసు. వీటివల్ల ఆయన కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం పేరుతో ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి తహతహ లాడుతున్నారు. సలహాదారుల పెత్తనం పెరగడంతో మం త్రుల్లో జవాబుదారీతనం లోపించింది. దారి తప్పిన ఎమ్మె ల్యేలను కట్టడి చేయలేని పరిస్థితి. మొత్తంగా పరిపాలనపై చంద్రబాబుకు పట్టు సడలిపోయింది. ఫలితంగా వివిధ వర్గాల ప్రజల పరిస్థితి దిక్కూదివాణం లేనట్టుగా తయా రైంది. క్లుప్తంగా చెప్పాలంటే రాష్ట్రంలో భయంకరమైన పరిపాలనా శూన్యత ఏర్పడింది.     
- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త శాసనమండలి ప్రతిపక్ష నేత
మొబైల్ : 8106915555

Advertisement

తప్పక చదవండి

Advertisement