అశ్లీల సినిమాల నిషేధం | Sakshi
Sakshi News home page

అశ్లీల సినిమాల నిషేధం

Published Sun, Jan 18 2015 1:01 AM

Ban on pornographic films

సినిమా పేరుతో ఏమిచేసినా, చూపినా తప్పు, నేరం కాదా? డబ్బు కోసం సినిమా, వినోదం, కళ, పాత్రల పేరుతో అసభ్యత, అశ్లీలాన్ని కెమెరాతో చిత్రీకరించి జనానికి చూపితే తప్పు, నేరం కావా? అదే కెమెరాతో చిత్రీకరించకుండా సినిమా పేరుతో కాకుం డా మామూలుగా సంఘటన జరిగితే మాత్రం నేరమని మన పాలకులు, పత్రికలు, చానెళ్లు చెబున్నాయి. ఇటువంటి పాలకులు, పార్టీలు, పత్రికలు, వార్తా చానెళ్ల వల్లే మన సమాజంలో వేగంగా మానవ సంబంధాలు సామాజిక వాతావరణం దెబ్బతిని నేరాలు, ఘోరాలు, విచ్ఛిన్నాలతో పతనమవుతోంది.
 
 మన దేశానికి స్వాతంత్య్రం ఇందుకేనా? పాలకులు, పార్టీలు, పత్రికలు, వార్తా చానెళ్లు సినిమా రంగంతో గల వ్యాపార, అనైతిక సంబంధాలతో స్త్రీ వ్యామోహాన్ని, అశ్లీలాన్ని చట్టబద్ధంగా వ్యాప్తి చేస్తున్నాయి. తల్లి దండ్రుల కుటుంబాల కన్నీళ్లు మానసిక చిత్రవధ వీరికిపట్టదు. ప్రజాధనంతో రాయితీలు, అవార్డులు ఇస్తూ మరింతగా ప్రోత్సహి స్తున్నారు. నేటి పరిస్థితులను చూసి అధిక శాతం ఆడపిల్లను కనడానికీ భయపడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సినిమా, అశ్లీల వినోదాలు, వికృత సంస్కృతి నిర్మూలన, నిషేధా నికి ఉద్యమించే పార్టీలు, మాధ్యమాలకే ప్రజలు, కుటుంబాల మద్దతు లభిస్తుంది. ఇప్పటికైనా పాలకులు, పార్టీలు, మాధ్య మాలు మారాలి. లేనట్లయితే ప్రజలే బుద్ధి చెబుతారు.
 - శారి రాంప్రసాద్, హైదరాబాద్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement