భూబకాసురుడిగా చంద్రబాబు పాలన | Sakshi
Sakshi News home page

భూబకాసురుడిగా చంద్రబాబు పాలన

Published Tue, Oct 20 2015 1:43 AM

భూబకాసురుడిగా చంద్రబాబు పాలన - Sakshi

రాజధాని గుర్తింపు, భూసంబంధ, నిర్మాణ అంశాలు అన్నీ రహస్యంగా, తన సొంత వ్యవహారంలా చేస్తున్న చంద్రబాబు పాలనలో రాష్ట్ర రైతాంగం అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం కంట కన్నీరే కారుతోంది.
 
 రాష్ట్ర రైతాంగం నుంచి లక్షల ఎకరాల భూమిని (సుమారు 15 లక్షలు) సేకరించి భూ నిధిని (ల్యాండ్ బ్యాంక్) సృష్టించుకోవాలనీ, ఈ భూమి నే ప్రధాన పెట్టుబడిగా మలచి ఆదాయాన్ని సమకూర్చుకో వాలనీ సీఎం చంద్రబాబు నిర్ణ యించుకున్నట్లు స్పష్టమౌ తోంది. బహుళ పంటలు పండే భూములను ఇష్టం వచ్చి నట్లు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా అవసరానికి మించి, అవసరం లేనిచోట, ఇష్టానుసారం సేకరించ డమే ధ్యేయంగా సాగితే మాత్రం చంద్రబాబు వ్యాపార విజన్‌కు మొదట బలయ్యేది రైతులు, రైతు కూలీలు, ఆ ప్రాంత ప్రజానీకమేనని వేరే చెప్పనవసరం లేదు.
 
 రాజధాని రైతుల నుంచి సేకరిస్తున్న 33 వేల ఎకరా లతోపాటు మరో 55 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయమని కేంద్రాన్ని కోరినట్లు, త్వరలోనే డీనోటిఫై అవుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజ ధాని ప్రాంతంలో మొత్తం 88 వేల ఎకరాలతో ప్రభు త్వం తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని సీఎం ప్రకటన తేల్చింది. ముందు రాజధాని ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూమి (అటవీ భూమితోసహా) ఎంత ఉందో గుర్తించి దానిలో నిర్మాణ పనులు చేపట్టాలని మరీ అవసరమైతే అప్పుడు రైతు లను ఒప్పించి సేకరించవచ్చని ఆ నాడే సూచించాం.
 
 రాజధాని గుర్తింపు, భూసంబంధ, నిర్మాణ అం శాలు అన్నీ రహస్యంగా తన సొంత వ్యవహారంలా చేస్తున్న చంద్రబాబు మా మాటలను పెద్దగా పట్టించుకో లేదు. ఇప్పుడిప్పుడే రహస్యాలు బహిరంగమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ భూదాహానికి రైతాంగం ఎంతగా భయకంపితమౌతుందో, ఏవిధంగా బలవన్మ రణాలకు పాల్పడుతున్నదో మచి లీపట్నం, భోగాపురం ప్రాంతా ల్లోకి వెళితే తెలుస్తుంది. మచిలీ పట్నం పోర్టు నిర్మాణానికి కాం గ్రెస్ ప్రభుత్వం 5,324 ఎకరా లను సేకరించేందుకు జీవో ఇచ్చింది. దీనిలో సుమారు మూడు వేల ఎకరాలు ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ భూములు కాగా మిగతా రెండు వేల ఎక రాలు రైతుల వద్ద నుంచి సేకరిం చాల్సింది. కానీ అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు రోడ్లెక్కారు. పోర్టుకు వెయ్యి ఎకరాలు సరిపోతాయన్నారు. రైతుల భూములు సేకరిస్తే ఊరుకోమన్నారు. కానీ అధికారంలోకి రాగానే భూబకాసురుడు నిద్రలేచినట్లు మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి, పోర్టు ఆధారిత పరిశ్రమల కారిడార్‌కు కలిపి 14,500 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. అదనంగా మరో 20 వేల ఎకరాలు సేకరిం చనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో బందరు ప్రాంత రైతుల గుండెల మీద పిడుగు పడినట్లయింది.
 
 విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం సుమారు 15,500 ఎక రాలు సేకరిస్తున్నామని చెప్పడంతో కొబ్బరి, జీడిమా మిడి పంటల ఫలసాయం మీద ఆధారపడి ఏడాది పొడ వునా భరోసాతో జీవిస్తున్న రైతాంగం, రైతు కూలీలు, ఇతర ప్రజానీకం ఒక్కసారిగా ఆందోళనలోకి వెళ్లింది. విశాఖలో ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్టుకు సమీపంలో వం దల ఎకరాల ఖాళీ భూమి ఉందని దాన్ని వినియోగించ కుండా తమ భూముల్లోకి ఎందుకు వస్తున్నారని భోగా పురం ప్రజలు ఆవేదనతో ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఇటీవల సమారు ఆరు పెళ్లిళ్లు నిలిచిపోయాయని మహిళలు కన్నీటితో వాపోయారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం గూడెపు వలసలో మగటపల్లి పెదకృష్ణమూర్తి చెరు వులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎ.రావివలసకు చెందిన వెంపాడ రామసూరి కొద్ది రోజులుగా ఆందోళన చెందుతూ గుండె పోటుతో మృతి చెందాడు. ఇదే విధంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో వ్యవసాయాధారిత పరి శ్రమల కోసం వ్యవసాయ భూములను కేటాయిస్తూ నిర్ణ యం చేశారు. కుప్పం నియోజక వర్గంలో ఎయిర్‌పోర్టుకంటూ పచ్చటి పొలాలను లాక్కునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ బాబు పాలనలో రాష్ట్ర రైతాంగం అనుభవిస్తున్న కష్టాలు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం కంట కన్నీరే కారుతోంది. రైతుకు మృత్యుఘోష తప్పడం లేదు.
 
 నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటా యింపులకు సంబంధించి ఏ అవసరానికి ఎంత భూమి కేటాయించాలో విచక్షణతో పారదర్శకంగా ఉండాలని ఒక పాలసీని తీసుకువచ్చాం. రైతుకు రక్షణ కవచంగా ఉన్న భూసేకరణ చట్టం ప్రకారమయితే చంద్రబాబు ప్రభుత్వం లక్షల ఎకరాల వ్యవసాయ, పంట భూము లను రైతుల నుంచి సేకరించలేడు. కనుకనే భూ సమీ కరణ పల్లవి అందుకుంటున్నాడు. బాబు భూసమీకరణ ఉచ్చులో చిక్కుకోకుండా రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా భూసేకరణ ప్రకటించిన ప్రాంత రైతాంగానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు సంఘ నాయకులు, మేధావులు, పౌర, ప్రజాస్వామిక సంస్థలు, ప్రజాసం ఘాలు రైతుకు అండగా, రైతు పోరా టానికి దన్నుగా నిలవాల్సిన సమయమిది.
 (వ్యాసకర్త: అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మొబైల్: 8297199999
 - డా॥ఎన్.రఘువీరారెడ్డి

Advertisement
Advertisement