ప్రభుత్వ బడి బతికితేనే ప్రగతి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడి బతికితేనే ప్రగతి

Published Tue, Sep 16 2014 1:09 AM

ప్రభుత్వ బడి బతికితేనే ప్రగతి

ప్రతి తరగతి గది విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ పరిశోధనాలయం. ఉపాధ్యాయుడు తన పాఠాన్ని ఒక పరిశోధనా ప్రాజెక్టుగా స్వీకరించాలి. దీని వల్ల విద్యార్థిలో అర్థం చేసుకొనే సామర్థ్యం పెంపొందుతుంది. ఈ విధంగా విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య బాంధవ్యం రెట్టింపవుతుంది.
 
 జ్ఞానంలో భారతదేశానిది గురుస్థానమని వల్లెవేసు కుంటూ ఉంటాం. అఖండ భారతంలో వందల సంవ త్సరాల క్రితమే తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు వేలాది మంది విద్యార్థులతో విలసిల్లాయి. ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి విద్యను అభ్యసిం చినట్లు చారిత్రక ఆధారాలు కూ డా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కనీసంగా దేశంలోని బాలలం దరికీ నాణ్యమైన విద్యను అందిం చలేకపోతున్నామని భారత ప్రభు త్వమే గణాం కాలతో సహా చెబు తోంది.
 
 అలాగే దేశంలో గొప్ప మానవ సంపద ఉన్నది. దాన్ని గొప్పమానవ వనరుగా మార్చు కున్నప్పుడే దేశం అన్ని రంగాల్లో శిరసెత్తుకొని నిలుస్తుంది. మరి ఆ రంగాలన్నింటినీ సమున్నత స్థానంలో నిలబెట్టేది విద్యారంగం ఒక్కటే. అస్త వ్యస్తంగా ఉన్న ఆ విద్యారంగాన్ని సరిదిద్దుకోవాలి. మన తరగతి గదిని యుద్ధ ప్రాదిపదికపై సంస్కరించుకోవాలి. కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వా లు విద్యారంగంలో ఉన్న ప్రాథమిక విషయాలపై చర్చను ఆరం భించడం ముదావహం. ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపు కుంటున్నాం. ఆ ఉత్సవాలు ఇచ్చే స్ఫూర్తితో తరగతి గదులన్నీ నిండే విధంగా కూడా జాగ్రత్త పడాలి. విద్యార్థి, ఉపాధ్యాయుల ను ఏకం చేసే తరగతి గదిని సమున్నతంగా తీర్చిదిద్దుకోవాలి.  
 
 తరగతి గది కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేస్తుంది. ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేడు. ఒక ఉపాధ్యాయుడిగా నేను పిల్లలను 1+3/4+1/2 కలిపితే ఎంత వస్తుంది? అని అడిగితే... కొందరు 2 1/4 అని, ఇంకొందరు 1 1/8 అనీ, మరికొందరు 1 1/4 అనీ చెప్పేవారు. దీనిలో వారు చెప్పినవన్నీ సరైనవి కాకపోవచ్చు. అనంతరం మీరు చెప్పేదాన్ని బోర్డుపై విశ్లేషించాలని అడిగినపుడు వారి ఆలోచనా విధానం నా గ్రాహ్యశక్తిలోని లోపాలకు అద్దం పట్టిం ది. నేను నేర్చుకొనే రోజుల్లో ఉపాధ్యాయుణ్ణి అనుకరించేవాణ్ణి. కానీ బోధించే సమయంలో మాత్రం నా గ్రాహ్యశక్తిలోని లోపా లను గుర్తించాను. దీన్నే ఎక్స్‌ప్లోరేషన్ అంటాం. ఉపాధ్యా యుడు తరగతి గదిలో విద్యార్థులతో కలిసి జ్ఞానసాగరంలో ఈదుతాడు. విద్యార్థులకు ఒక్కటే విధంగా చెప్పి అదే సరైనదని అంటే దాన్ని బట్టీ పట్టేపనిలో పడతాడు. స్వతహాగా ఆలోచించే ప్రయత్నం చేయడు. విద్యార్థులను స్వేచ్ఛగా ఆలోచింపజే యాలి. ప్రతి తరగతి గది విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ పరిశోధ నాలయం. ఉపాధ్యాయుడు తన పాఠాన్ని ఒక పరిశోధనా ప్రాజె క్టుగా స్వీకరించాలి. దీని వల్ల విద్యార్థిలో అర్థం చేసుకొనే సామ ర్థ్యం పెంపొందుతుంది. ఈ విధంగా విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య బాంధవ్యం రెట్టింపవుతుంది.  
 
 మేము  మొదలుపెట్టిన ఐఐటీ మొదటి బ్యాచ్  విద్యార్థి ఒకరు ఇటీవల ఫోన్ చేశాడు. ‘ఎలా ఉన్నారు సార్!’ అన్నాడు. నేనెవరో చెప్పగలుగుతారా అని ప్రశ్నించాడు. ‘నువ్వు ప్రకాశ్ కదా!’ అన్నాను. ‘నన్నెలా గుర్తు పట్టారు?’ అని అడిగాడు. ‘నా దగ్గర చదువుకున్న రోజుల్లో నువ్వు నాపై వేసిన ముద్ర అది!’ అని బదులిచ్చాను. అది ఎప్పటికీ చెరిగిపోదన్నాను. ఎలా ఉన్నారని అడిగితే నా వయసు 87. నీది 40 కావచ్చు కదా అన్నాను. వయసులు మారాయి. మన బాంధవ్యం మాత్రం చిరస్థాయిగా ఉంటుందని  బదులిచ్చాను.
 ఈనాడు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చా యి. ఈ తరం పిల్లలు ఎంతో తెలివైనవారు. చిన్నప్పటినుంచే ఇంటర్నెట్‌ల ద్వారా ప్రపంచాన్ని వీక్షించగలుగుతున్నారు. తరగతి గదిలో కంటే ఇంటర్నెట్ తెరలను వీక్షించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
 
  సమాచార విప్లవం ఎంతో విస్తా రంగా, పిల్లల చేతిదాకా వస్తున్నప్పటికీ విద్యలో ప్రమాణాలు పెరగకపోవటం ఆందోళన కలిగిస్తుంది. అంటే సమాచార జ్ఞానం ఎంత ఉన్నా ఆ సమాచారాన్ని గురువు, శిష్యుడు ఇద్దరూ కలిసి మథిస్తేనే అది జ్ఞానసాగర మవుతుంది.  ప్రభుత్వ పాఠశాలలు శక్తిమంతం కావాలి. అప్పుడే విద్యారంగంలో ప్రమాణాలు పెరుగుతాయి. అట్టడుగు దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్య మైన విద్యను అందించగలి గినప్పుడే మహాత్మా జ్యోతిబాఫూలే, సావిత్రిఫూలే, అంబేద్కర్ కలలు నెరవేరతాయి. కొఠారీ  కన్న కలలు అభివృద్ధి పూలై విరబూస్తాయి. విద్యారంగంలో ప్రమాణాలు పెరిగితే, ప్రభుత్వ బడులు శక్తివంతమైతే నైపుణ్యమున్న మానవ వనరులుగా మన పిల్లలు మారుతారు. మన చదువులు దేశాన్ని సమున్నతంగా నిల బెట్టాలి. ప్రపంచానికే దిశానిర్దేశం చేసే దశకు ఎదగాలి. మానవ విలువలను పరిమళింపజేసే జ్ఞాన వృక్షాలుగా విస్తరించాలి. అప్పుడే జ్ఞానానికి అర్థం. విజ్ఞానానికి పరమార్థం.
 (వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)
 డా॥చుక్కా రామయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement