గ్రహం అనుగ్రహం ( 1-09-2015 ) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం ( 1-09-2015 )

Published Tue, Sep 1 2015 1:34 AM

గ్రహం అనుగ్రహం ( 1-09-2015 ) - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, వర్ష ఋతువు
 శ్రావణ మాసం, తిథి బ.తదియ సా.5.46 వర తదుపరి చవితి,
నక్షత్రం ఉత్తరాభాద్ర ప.12.04 వరకు తదుపరి రేవతి
వర్జ్యం రా.11.14 నుంచి 12.44 వరకు
దుర్ముహూర్తం ఉ.8.18 నుంచి 9.08 వరకు
తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు
అమృతఘడియలు ఉ.7.38 నుంచి 9.07 వరకు
సూర్యోదయం    : 5.49
సూర్యాస్తమయం:     6.12
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
 
మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడ ఉండవు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం నెలకొంటుంది.

 వృషభం: పనులు చకచకా సాగుతాయి. వస్తు లాభాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

 మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 కర్కాటకం: శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 సింహం: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు. ధన వ్యయం. బంధువర్గంతో అకారణంగా విభేదాలొస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

 కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి, ధన లాభాలు అందుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.

 తుల: అనుకోని ఆహ్వానాలు. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

 వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసి రావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు రావచ్చు. ఉద్యోగులకు ఒత్తిడులు.

 ధనుస్సు: కుటుంబసభ్యులతో తగాదాలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

 మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పనులలో పురోగతి సాధిస్తారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
కుంభం
: కుటుంబంలో చికాకులు పెరిగే అవకాశం ఉంది. ధన వ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురవుతుంది.
 
మీనం: శుభవార్తలు వింటారు. వాహన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement