గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Tue, Jan 27 2015 3:29 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

 శ్రీ జయనామ సంవత్సరం,  ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం; తిథి శు.అష్టమి రా.2.43 వరకు
 నక్షత్రం అశ్వని సా.4.21 వరకు; తదుపరి భరణి
 వర్జ్యం ప.12.32 నుంచి 2.03 వరకు
 తిరిగి రా.1.39 నుంచి 3.11 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.53 నుంచి 9.36 వరకు
 తదుపరి రా.10.55 నుంచి 11.46 వరకు
 అమృతఘడియలు ఉ.9.32 నుంచి 11.04 వరకు

 సూర్యోదయం :    6.38
 సూర్యాస్తమయం: 5.48
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం:  ఉ.9.00 నుంచి  10.30 వరకు

భవిష్యం
 
మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
 
వృషభం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
మిథునం
: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.
 
కర్కాటకం:
ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం.  ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
సింహం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
 
కన్య: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలిసిరావు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
 
తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
వృశ్చికం
: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
 
ధనుస్సు
: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.
 
మకరం: కొన్ని కార్యక్రమాలలో  స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు.
 
కుంభం: పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
మీనం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు స్వల్ప మార్పులు.
 
- సింహంభట్ల సుబ్బారావు

 
 
 

Advertisement
Advertisement