గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Fri, Apr 10 2015 2:10 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం,  ఉత్తరాయణం, వసంత ఋతువు
 చైత్ర మాసం, తిథి బ.షష్ఠి రా.7.26 వరకు
 నక్షత్రం మూల తె.4.32 వరకు
 (తెల్లవారితే శనివారం)
 వర్జ్యం ప.12.43 నుంచి 2.20 వరకు
 తదుపరి రా.2.55 నుంచి 4.30 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.10 వరకు
 తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు

 సూర్యోదయం    : 5.53
 సూర్యాస్తమయం: 6.10
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:  ప.3.00 నుంచి  4.30 వరకు
 
 భవిష్యం

 మేషం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటం కాలు రావొచ్చు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 వృషభం: బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు. ఆలో చనలు కలసిరావు. వ్యాపారాలలో ఒడి దుడుకులు. ఉద్యోగులకు పనిభారం.
 మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. వాహన యోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభకార్యాలలో పాల్గొం టారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగ వర్గాలకు పదోన్నతులు.
 సింహం: చేపట్టిన పనుల్లో జాప్యం జరుగు తుంది ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తి డులు తప్పవు.
 కన్య: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభే దాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనా రోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
 తుల: బంధువుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగు తాయి. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
 మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 కుంభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభ కార్యాలలో పాల్గొంటారు. వాహన యోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యో గులకు పదోన్నతులు.
 మీనం: చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలం. పరిచ యాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపా రాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement