గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Wed, May 6 2015 1:56 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం,  ఉత్తరాయణం, వసంత ఋతువు,  వైశాఖ మాసం
 తిథి బ.విదియ ఉ.9.20 వరకు
 తదుపరి తదియ
 నక్షత్రం అనూరాధ ప.12.05 వరకు
 తదుపరి జ్యేష్ఠ
 వర్జ్యం సా.5.46 నుంచి 7.24 వరకు
 దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.21 వరకు
 అమృతఘడియలు రా.3.33 నుంచి 5.07 వరకు
 సూర్యోదయం :    5.36
 సూర్యాస్తమయం:     6.18
 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
 యమగండం:  ఉ.7.30 నుంచి  9.00 వరకు

భవిష్యం
 మేషం: వ్యతిరేకులు పెరుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు రావొచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం ఎదురవుతుంది.
 వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు లాభాలు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 మిథునం: దూరపు బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.
 కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
 సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణ ఒత్తిడులు. ఆలోచనలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
 కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లాభిస్తాయి.
 తుల: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు రావొచ్చు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో గందరగోళం నెలకొంటుంది. అనారోగ్యం.
 వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
 మకరం: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. విద్యావకాశాలు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి.
 కుంభం: పలుకుబడి పెరుగుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. బంధువులతో వివాదాలు తీరి సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం నెలకొంటుంది.
 మీనం: రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement