గ్రహం అనుగ్రహం ( 25-08-2015 ) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం ( 25-08-2015 )

Published Tue, Aug 25 2015 1:21 AM

గ్రహం అనుగ్రహం ( 25-08-2015 ) - Sakshi

గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం,  వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.దశమి ఉ.8.17 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం మూల రా.7.54 వరకు
వర్జ్యం రా.6.15 నుంచి 8.17 వరకు
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు
తదుపరి రా.10.50 నుంచి 11.41 వరకు
అమృతఘడియలు ప.1.24 నుంచి 3.01 వరకు
 
సూర్యోదయం    : 5.48
సూర్యాస్తమయం:     6.17
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.

భవిష్యం
 
మేషం: పనుల్లో ఆటంకాలు . ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యో గాల్లో కొన్ని మార్పులు.

వృషభం: మిత్రులతో విభేదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.

మిథునం: శుభవార్తలు వింటారు. బంధువులతో సఖ్యతగా మెలగుతారు. వస్తు లాభాలు. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

సింహం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాల సందర్శన. కుటుంబసభ్యులతో వివాదాలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో  విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: కొత్త మిత్రులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందువినోదాలు. యత్న కార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూ లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. ధనవ్యయం. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి కలుగుతుంది. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. భూ, వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశ ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement