గ్రహం అనుగ్రహం, శుక్రవారం, జూలై 31, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శుక్రవారం, జూలై 31, 2015

Published Fri, Jul 31 2015 3:01 AM

graham anugraham

శ్రీ మన్మథనామ సంవత్సరం, ద క్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢమాసం,
తిథి పౌర్ణమి రా.5.01 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఉత్తరాషాఢ, ఉ.11.04 వరకు,
 తదుపరి శ్రవణం, వర్జ్యం ప.2.54 నుంచి 4.26 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు,
 అమృతఘడియలు ఉ.4.53 నుంచి 6.30 వరకు
 సూర్యోదయం    :    5.42
 సూర్యాస్తమయం    :    6.31
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు, గురుపౌర్ణమి.

భవిష్యం
 
మేషం: పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
వృషభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
 
మిథునం
: ఇంటా బయటా చికాకులు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా విభేదాలు. ధన వ్యయం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
 
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
సింహం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు. కార్యజయం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
కన్య: పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
 
తుల: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
ధనుస్సు: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
 
మకరం: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
 
కుంభం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు.  వ్యాపార, ఉద్యోగాలలో గందర గోళం.
 
మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 


 

Advertisement
Advertisement