గ్రహం అనుగ్రహం (14-10-2015) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-10-2015)

Published Wed, Oct 14 2015 12:35 AM

గ్రహం అనుగ్రహం (14-10-2015) - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు
 ఆశ్వయుజ మాసం తిథి శు.పాడ్యమి ఉ.6.02 వరకు
 తదుపరి విదియ  నక్షత్రం స్వాతి పూర్తి
వర్జ్యం ఉ.10.03 నుంచి 11.48 వరకు
దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.12 వరకు
అమృతఘడియలు రా.8.37 నుంచి 10.21 వరకు
 
సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం:     5.38
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
 
మేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆలయ దర్శనాలు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలత.
 
వృషభం: నూతన వ్యక్తులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. వ్యయ ప్రయాసలు. దూర ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ధన వ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
 
సింహం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకెళతారు.
 
కన్య: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 
తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందువినోదాలు. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వాహన యోగం కలుగుతుంది.
 
వృశ్చికం: కుటుంబసభ్యులతో మాట పట్టింపులు. ధన వ్యయం. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకమే.
 
మకరం: ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కుంభం: ఆర్థిక ఇబ్బందులు, రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
మీనం
: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు తప్పకపోవచ్చు.
 
- సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement