గ్రహం అనుగ్రహం (29-01-2016) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (29-01-2016)

Published Fri, Jan 29 2016 12:41 AM

గ్రహం అనుగ్రహం (29-01-2016) - Sakshi

శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు  పుష్య మాసం, తిథి బ.పంచమి ప.12.51 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం హస్త పూర్తి, వర్జ్యం ప.1.03 నుంచి 2.48 వరకు, దుర్ముహూర్తం ఉ.8.51 నుంచి 9.40 వరకు, తదుపరి ప.12.35 నుంచి 1.26 వరకు, అమృతఘడియలు రా.11.38 నుంచి 1.32 వరకు
 
 సూర్యోదయం    :    6.37
 సూర్యాస్తమయం    :    5.49
 రాహుకాలం:           ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి  4.30 వరకు

భవిష్యం
 
మేషం: ధన, వస్తులాభాలు. పనులు సజావుగా పూర్తి కాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు.
 
వృషభం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు ఒత్తిడులు.
 
మిథునం:  ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. సోదరులు, సోదరీలతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
సింహం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
 
కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.
 
తుల: వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. బంధువులతో తగాదాలు. పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
 
వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన వ్యక్తుల పరిచయం. దైవ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.
 
ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన ఉద్యోగలాభం. సోదరులు, మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
 
మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కుంభం: ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
 
మీనం: కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. దైవచింతన. ఆర్థిక లాభాలు అందుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందు వినోదాలు. వ్యాపారాల విస్తరణ చేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.
 
- సింహంభట్ల సుబ్బారావు
 

Advertisement
Advertisement