గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Fri, Jun 3 2016 12:07 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం తిథి బ.త్రయోదశి ప.1.30 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం భరణి సా.4.30 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.3.44 నుంచి 5.13 వరకు, దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు, తదుపరి ప.12.22 నుంచి 1.14 వరకు, అమృతఘడియలు ప.12.06 నుంచి 1.35 వరకు
సూర్యోదయం    :      5.28
సూర్యాస్తమయం    :    6.26
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
 

భవిష్యం

 

మేషం: పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

 
వృషభం
: దూరప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 
మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంటాబయటా అనుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

 
కర్కాటకం: వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న రాబడి దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

 
సింహం
: మిత్రులతో కలహాలు. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశాజన కంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

 
కన్య
: దూరప్రయాణాలు. పనుల్లో అవాంత రాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళం.

 
తుల
: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులా భాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.


 వృశ్చికం: ఆర్థిక ప్రగతి. నూతన కార్య క్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.


ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు విధులు.

 
మకరం: కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

 
కుంభం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.

 
మీనం
: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 - సింహంభట్ల సుబ్బారావు

 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement