గ్రహం అనుగ్రహం (24-08-2016) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (24-08-2016)

Published Fri, Aug 26 2016 12:58 AM

గ్రహం అనుగ్రహం (24-08-2016) - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి బ.నవమి రా.8.32 వరకు, నక్షత్రం రోహిణి ప.2.10 వరకు
తదుపరి మృగశిర, వర్జ్యం ఉ.6.38 నుంచి 8.11 వరకు, తిరిగి రా.7.26 నుంచి 8.57 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు, అమృతఘడియలు ప.11.10 నుంచి 12.40 వరకు

భవిష్యం
మేషం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవ చింతన కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. విందువినోదాలు.
మిథునం: వ్యయ ప్రయాసలు. బంధు విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం: పనులు సజావుగా సాగుతాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
కన్య: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
తుల: కుటుంబసభ్యులతో వైరం పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం కలుగుతుంది. భూ వివాదాల పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. దుబారా వ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశాజనకమే.
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభం. యత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు
 
సూర్యోదయం    :    5.48
సూర్యాస్తమయం    :    6.21
రాహుకాలం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

Advertisement
Advertisement