గ్రహం అనుగ్రహం (1-12-16) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (1-12-16)

Published Thu, Dec 1 2016 12:31 AM

గ్రహం అనుగ్రహం (1-12-16) - Sakshi

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు  మార్గశిర మాసం, తిథి శు.విదియ రా.8.20 వరకు, నక్షత్రం మూల తె.4.07 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం ఉ.10.43 నుంచి 12.25 వరకు, తదుపరి రా.2.23 నుంచి 4.06 వరకు, దుర్ముహూర్తం ఉ.10.03 నుంచి 10.54 వరకు, తదుపరి ప. 2.33 నుంచి 3.13 వరకు, అమృతఘడియలు రా.9.10 నుంచి 10.54 వరకు
 
సూర్యోదయం           :  6.16
సూర్యాస్తమయం           :  5.28
రాహుకాలం :   ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు

 భవిష్యం

మేషం: రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయా ణాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

వృషభం: కుటుంబ,ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: అనుకున్న పనులు సకాలంలో నెరవేరతాయి. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తులు సహాయపడతారు. రుణఒత్తిడులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో మాటప ట్టింపులు. వ్యయప్రయాసలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో  వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మకరం: వ్యవహారాలలో ఆటంటకాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.

కుంభం: కార్యజయం. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

- సింహంభట్ల సుబ్బారావు

 

Advertisement
Advertisement