గ్రహం అనుగ్రహం, జూన్ 11, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, జూన్ 11, 2016

Published Sat, Jun 11 2016 1:36 AM

గ్రహం అనుగ్రహం, జూన్ 11, 2016 - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం
తిథి శు.సప్తమి రా.3.04 వరకు,
నక్షత్రం మఖ ప.12.32 వరకు,
తదుపరి పుబ్బ,
వర్జ్యం రా.9.02 నుంచి 10.43 వరకు,
దుర్ముహూర్తం ఉ.5.27 నుంచి 7.12 వరకు,
అమృతఘఢియలు ఉ.10.03  నుంచి  11.44 వరకు
 

భవిష్యం


మేషం: పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

 
వృషభం: బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి.

 
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 సింహం: కార్యజయం కలుగుతుంది. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

 కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

 తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 
వృశ్చికం: నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

 
ధనుస్సు
: ఆదాయం కంటే ఖర్చులు అధికం అవుతాయి. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

 
మకరం
: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

 
కుంభం
: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

 
మీనం
: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు.

 
- సింహంభట్ల సుబ్బారావు

 

 

 

Advertisement
Advertisement