గ్రహం అనుగ్రహం, మే 21, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మే 21, 2016

Published Sat, May 21 2016 1:13 AM

గ్రహం అనుగ్రహం, మే 21, 2016 - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం, తిథి పౌర్ణమి రా.1.40వరకు,

నక్షత్రం విశాఖ రా.6.27 వరకు

వర్జ్యం రా.10.50 నుంచి 12.34 వరకు,

దుర్ముహూర్తం ఉ.5.31 నుంచి 7.12 వరకు

అమృతఘడియలు ఉ.8.45 నుంచి 10.31 వరకు
 


భవిష్యం

మేషం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ధన లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

 
వృషభం: ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

 
మిథునం: సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

 
కర్కాటకం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 
సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్య కరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.

 
కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

 
తుల: శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఆలయాల సందర్శనం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

 
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో కలహాలు. రుణాలు చేయాల్సివస్తుంది. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

 
ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. సోదరులు,మిత్రుల నుంచి ధనలాభం. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

 
మకరం: ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.

 
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార,ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

 
మీనం: చేపట్టిన పనులలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు సాదా సీదాగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

 
- సింహంభట్ల సుబ్బారావు

 

 

 

Advertisement
Advertisement