గ్రహం అనుగ్రహం, ఆదివారం 10, జులై 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, ఆదివారం 10, జులై 2016

Published Sun, Jul 10 2016 12:36 AM

గ్రహం అనుగ్రహం, ఆదివారం 10, జులై 2016 - Sakshi

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం
 గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి శు.షష్ఠి
 ప.3.44 వరకు తదుపరి సప్తమి
 నక్షత్రం ఉత్తర రా.11.20 వరకు
 వర్జ్యం ఉ.5.18 నుంచి 6.58 వరకు
 దుర్ముహూర్తం సా.4.54 నుంచి 5.44 వరకు
 అమృతఘడియలు ప.3.35 నుంచి 5.36 వరకు
 సూర్యోదయం    :    5.35
 సూర్యాస్తమయం    :    6.39
 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
 

భవిష్యం
మేషం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

 వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

 మిథునం: దూర ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

 కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 సింహం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం. పనులలో ఆటంకాలు కలగవచ్చు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

 కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు. శుభవార్తలు. ఆకస్మిక ధన లాభం. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

 తుల: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు అధికం. దూర ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

 వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

 ధనుస్సు: రుణాలు తీరతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

 మకరం: వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 కుంభం: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 మీనం: నూతన పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement