గ్రహం అనుగ్రహం, గురువారం 14, జులై 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 14, జులై 2016

Published Thu, Jul 14 2016 12:44 AM

గ్రహం అనుగ్రహం, గురువారం 14, జులై 2016 - Sakshi

శ్రీ దుర్ముఖినామ  సంవత్సరం, ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు  ఆషాఢ మాసం, తిథి శు.దశమి రా.10.56 వరకు,
నక్షత్రం స్వాతి ఉ.6.43 వరకు, తదుపరి విశాఖ,
వర్జ్యం ప.12.55 నుంచి 2.40 వరకు  దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.51 వరకు,
తదుపరి ప.3.10 నుంచి 4.01 వరకు,
అమృతఘడియలు రా.11.30 నుంచి 1.18 వరకు 
సూర్యోదయం    :    5.36
సూర్యాస్తమయం    :    6.39
రాహుకాలం:  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు


భవిష్యం
 
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు. పనులలో పురోగతి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
వృషభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. అరుదైన సన్మానాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.
 
మిథునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ధన వ్యయం. కుటుంబ సభ్యులతో వివాదాలు. దూర ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటా బయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు.
 
సింహం: శ్రమ ఫలిస్తుంది. నూతనో త్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.
 
కన్య: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనా రోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
 
తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
వృశ్చికం: కుటుంబసభ్యులతో స్వల్ప వివా దాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.  వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
 
ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
మకరం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహ యోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
కుంభం: పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం. విద్యార్థులు ఫలితాలపై అసంతృప్తి చెందుతారు.
 
మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement