గ్రహం అనుగ్రహం, మంగళవారం 20, అక్టోబర్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 20, అక్టోబర్ 2015

Published Tue, Oct 20 2015 1:23 AM

గ్రహం అనుగ్రహం, మంగళవారం 20, అక్టోబర్ 2015 - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, శరదృతువు
 ఆశ్వయుజ మాసం, తిథి శు.సప్తమి ఉ.9.34 వరకు
 తదుపరి అష్ఠమి, నక్షత్రం పూర్వాషాఢ ప.11.10 వరకు
 తదుపరి ఉత్తరాషాఢ
 వర్జ్యం రా.7.00 నుంచి 8.35 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.09 వరకు
 తదుపరి రా.10.29 నుంచి 11.21 వరకు
 అమృతఘడియలు ఉ.6.20 నుంచి 7.56 వరకు
 సూర్యోదయం    : 5.58
 సూర్యాస్తమయం:     5.34
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు, దుర్గాష్టమి

భవిష్యం

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. దూర ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
వృషభం: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
 
మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిసుతంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
 
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 
సింహం: పనులలో ఆటంకాలు కలగవచ్చు. బంధు మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
 
కన్య: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యం. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
వృశ్చికం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
 
ధనుస్సు: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
 
మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు  మందకొడిగా సాగుతాయి.
 
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి లాభం కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. దైవదర్శనాలు.
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement

తప్పక చదవండి

Advertisement