గ్రహం అనుగ్రహం, మంగళవారం 10, ఫిబ్రవరి 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 10, ఫిబ్రవరి 2015

Published Tue, Feb 10 2015 3:01 AM

graham anugrham of the day feb 10 2015

 జయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి బ.షష్ఠి ప.3.06 వరకు
 తదుపరి సప్తమి, నక్షత్రం చిత్త ఉ.10.22 వరకు  తదుపరి స్వాతి
 
వర్జ్యం సా.4.18 నుంచి 6.01 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.34 వరకు
 తదుపరి రా.10.48 నుంచి 11.38 వరకు
 అమృతఘడియలు రా.2.30 నుంచి 4.11 వరకు
 
 సూర్యోదయం :    6.34
 సూర్యాస్తమయం:     5.56

 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం:  ఉ.9.00 నుంచి  10.30 వరకు

భవిష్యం

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
కర్కాటకం: శ్రమ మరింతగా పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
 
సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. రుణాలు తీరతాయి. వస్తులాభాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
కన్య: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
 
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
 
వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
 
మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగులలో చికాకులు తొలగుతాయి.
 
కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.
 
మీనం: ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
 
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement