జనం కోసమే జీవించిన వాడు | Sakshi
Sakshi News home page

జనం కోసమే జీవించిన వాడు

Published Wed, Sep 23 2015 1:19 AM

He alives for people only

భారతదేశంలోని అణగారిన ప్రజానీకం, భారత విప్లవోద్యమం 2015 ఆగస్టు 18వ తేదీన ఒక ప్రతి భావంతమైన మేధావి, ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నాయకుణ్ణి కోల్పోయాయి. ఆయనే విప్లవ శిబి రంలో విష్ణు, విజయ్‌గా పరిచయమైన శ్రీధర్ శ్రీనివాసన్. ఆయన ఏ విప్లవ ఆదర్శాల కోసం జీవించి తన ప్రాణాలు అర్పించారో ఆ విప్లవాశయాలను కొనసాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావో యిస్టు) కేంద్ర కమిటీ ప్రతిజ్ఞ చేస్తోంది.
 
 విప్లవకారునిగా ఆయన ప్రయాణం: 1978- 79లో బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ యువ ఆర్ట్స్ విద్యార్థిగా శ్రీధర్ విప్లవ రాజకీయాల పట్ల ఆక ర్షితుడై దేశంలోని అణగారిన ప్రజానీకం కోసం పని చేయడానికి తన కాలేజీ చదువులను వదిలిపెట్టాడు. ఆ తరువాత 36 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో, ప్రజ లకు సేవ చేయాలనే పట్టుదలతో కొనసాగాడు.
 
 బొంబాయిలో విద్యార్థి ప్రగతి సంఘటన (వీపీ ఎస్) బ్యానర్ కింద శ్రీధర్ విద్యార్థులను సమీక రించి ఆందోళనలు నడిపాడు. 1979లో పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా బొంబాయి విశ్వవిద్యాల యాన్ని విద్యార్థులు స్వాధీనం చేసుకున్న చారిత్రక ఘటనకి నాయకత్వం వహించిన వారిలో ఆయన ఒకరు. యువజనులలోకి ఉద్యమం విస్త రించిన సమయంలో తిరిగి ఆయన వారిని నౌ జవాన్ భారత సభ (ఎన్‌బీ ఎస్) బ్యానర్ కింద సమీకరించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన సిటీ కమిటీ సభ్యుడు అయిన తర్వాత ఉద్యమం, బొంబయి శివార్లలోని కార్మికవాడలు, థానే, భివాం డి, సూరత్ వరకు కూడా విస్తరించింది. 1990లో పార్టీ నిర్ణయం మేరకు ఆయన విదర్భ ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అక్కడ ఆయన చంద్రపూర్, వని లలోని బొగ్గు గని కార్మికులను సంఘటితం చేశాడు.
 
 2007 వరకూ రెండు దశాబ్దాల పాటు ఆయన మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చాలా సమర్ధ వంతంగా పార్టీకి నాయకత్వం వహించాడు. 2001 లో ఐక్యతా కాంగ్రెస్ (9వ కాంగ్రెస్) సందర్భంగా కేంద్ర కమిటీకి తిరిగి ఎన్నికయ్యాడు. ఉద్యమం ఆటుపోట్లకు గురైన అన్ని సందర్భాలలోనూ పార్టీ పంధాని సమర్థిస్తూ దృఢంగా నిలబడ్డాడు. పార్టీ అప్పగించిన బాధ్యతలని నెరవేర్చే విషయంలో ఏ తటపటాయింపుకూ గురికాకుండా ఒక మూలస్తంభంలా నిలిచాడు.
 
 అరెస్టు, జైలు జీవితం: 2007 ఆగ స్టులో శ్రీధర్ అరెస్టయ్యాడు. విచారణ పేరుతో రోజుల తరబడి, మానసిక చిత్ర హింసలను అనుభవించినప్పటికీ శత్రు వు ముందు తలవంచలేదు. ఆయనపై 60 కేసులకు పైగా పెట్టడం ద్వారా రాజ్యం ఆయనను సుదీర్ఘంగా జైలులో ఉంచే ప్రయ త్నం చేసి ఒక ఆరున్నరేళ్ల శిక్ష విధించడంలో సఫలం అయింది. తన విడుదల కోసం ఎదురుచూస్తూనే జైలులోని తన సహచర రాజకీయ ఖైదీలను చైతన్య వంతం చేసి ప్రభావితం చేశాడు. ఆ కాలమంతా జాతీయ, అంతర్జాతీయ పరిస్థితిని అధ్యయనం చేస్తూ అవిశ్రాంతంగా గడిపాడు. ఇస్లాం కార్యకర్త లతో చర్చిస్తూ వారి ఉద్యమాన్ని అర్థం చేసుకోవడా నికి ప్రయత్నం చేశాడు.
 
  2013 ఆగస్టులో ఆయన విడుదలయ్యాడు. జైలు జీవితం ఆయన స్ఫూర్తిని దెబ్బతీయలేకపో యినా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. విడుదలైన తర్వా త తన కుటుంబంతో ఉంటూ ఆ కాలాన్ని విప్ల వోద్యమ ప్రచారంలో గడిపాడు. తన సహచరులను తిరిగి కలవడానికి ఎదురుచూసి, వారిని కలిసే క్రమంలోనే అమరుడయ్యాడు. శ్రీధర్ అమరత్వం విప్లవోద్యమానికి తీవ్రమైన దెబ్బ. చివరిశ్వాస వర కు హృదయంలో శ్రామికవర్గ, విప్లవోద్యమ ప్రయో జనాలను నింపుకొని వారికోసం నిస్వార్థంగా పని చేసిన ఉత్తమ పుత్రులలో ఒకరిని ఈ దేశ శ్రామిక వర్గం, కష్టజీవులూ కోల్పోయారు. పార్టీ శ్రేణులు, ప్రజానీకం హృదయాల్లో శ్రీధర్ జీవించే ఉంటారు. ఆయన ఆదర్శాలను పార్టీ ఎత్తిపడుతుంది, ఆయన ఆశయాలను కొనసాగించడానికి అవిశ్రాంతంగా పోరాడతామని ప్రతినబూనుతుంది.
 
భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీ (మావోయిస్టు) ఆయనకు వినమ్రంగా విప్లవ జోహార్లు ఆర్పిస్తోంది. వారి కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖాన్ని పంచుకుంటోంది. శ్రీధర్ తన జీవి తాన్ని అర్పించిన ఆ గొప్ప ఆదర్శాలకు పునరం కితమవుదామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం.
 అభయ్  అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ, సీపీఐ (మావోయిస్టు)
 - శ్రీధర్ శ్రీనివాసన్

Advertisement

తప్పక చదవండి

Advertisement