ఆ ‘దిగ్గజాల’తో బీసీసీఐ విశ్వసనీయత మెరుగవుతుందా? | Sakshi
Sakshi News home page

ఆ ‘దిగ్గజాల’తో బీసీసీఐ విశ్వసనీయత మెరుగవుతుందా?

Published Sun, Jun 7 2015 12:51 AM

Improves the reliability of the BCCI?

క్రికెట్‌లో క్రమబద్ధీకరణ, పారదర్శకత విషయంలో ప్రత్యేకించి బీసీసీఐకి పేలవమైన రికార్డు ఉంది. ఇక కామధేనువులా మారిన ఐపీఎల్ విషయంలో దాని రికార్డును చెప్పనవసరం లేదు. దిగ్గజత్రయంతో ఏర్పరచిన కొత్త ప్యానెల్‌ని ఐపీఎల్‌పై తమ అభిప్రాయం చెప్పనిస్తారనడం అనుమానమే. అలాంటప్పుడు సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లను ఎందుకు ఆహ్వానించినట్లు?  
 
ఇటీవలే క్రికెట్ నుంచి వైదొలిగిన ముగ్గురు బ్యాటింగ్ దిగ్గ జాలకు భారతీయ క్రికెట్ బోర్డు పదవులను ప్రతిపాదించిన విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోనే అతి సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన క్రికెట్ సంస్థకు ‘సలహాదారులు’గా పనిచేయవలసిందిగా బీసీసీఐ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను కోరిం ది. విదేశాల్లో మన ఆటగాళ్ల సామర్థ్యాన్ని, వారి ప్రతిభాపా టవాలను మెరుగుపర్చేందుకోసం, అంతర్జాతీయ క్రికెట్ లోని కఠిన పరిస్థితులను ఎదుర్కొనడంలో మన క్రీడాకారు లకు మార్గనిర్దేశం చేయడం కోసం, దేశీయ క్రికెట్‌ను బలో పేతం చేయడానికి తగిన చర్యలు చేపడుతూ మన జాతీయ జట్టుకు మార్గదర్శకత్వం వహించడంపైనే ఈ దిగ్గజత్రయం ప్రధానంగా దృష్టిసారిస్తుందని బీసీసీఐ తన ప్రారంభ ప్రక టనలో తెలియచేసింది.
 
 ఈ ప్రకటనే చాలా అస్పష్టంగా కనిపిస్తోంది. బీసీసీఐ ప్రకటన అనంతరం సౌరవ్ గంగూలీ స్పంది స్తూ, తన పాత్ర ఏమిటి అనే విషయంలో ఇప్పటికైతే తనకు ఏమీ స్ఫురించడం లేదని చెప్పడం వింత గొల్పుతుంది. అంటే ఈ దిగ్గజాలు నిర్వహించే పాత్రపై బీసీసీఐ కనీసంగా కూడా వారితో చర్చించటం లేదనే దీనర్థం. ఈ ముగ్గురినీ బీసీసీఐతో అనుసంధానం చేస్తే బావుంటుందన్నదే తప్ప అంతకు మించిన నిర్దిష్టమైన ఆలోచన చేయలేదని స్పష్ట మవుతోంది.
 
 కాబట్టి ఏం జరుగుతోంది?
 ఈ ‘సలహా కమిటీ’లో చేరడానికి రాహుల్ ద్రావిడ్ తిర స్కరించినట్లు వస్తున్న వార్తలను మనమెలా అర్థం చేసుకో వాలి? పాత వైరం కారణంగా సౌరవ్ గంగూలీతో ముడిప డివున్న ఏ కమిటీలోనూ ద్రావిడ్ భాగం కాదల్చుకోలేదనే కథనం కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాల నుంచి వినవస్తోంది. దీన్ని నేను నమ్మలేదనుకోండి. అయితే రాహు ల్ ద్రావిడ్‌కు అండర్-16, అండర్-19, ఇండియా ‘ఏ’ టీమ్‌లకు సలహాదారుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు మరొక కథనం కూడా వినిపిస్తోంది. దీనికి అనుగుణంగానే శనివారం రాహుల్‌కు ‘ఏ’ టీమ్ కోచ్‌తో పాటు అండర్-19 జట్టు బాధ్యతలు కూడా అప్పజెపుతూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది.
 
 బీసీసీఐ ఏర్పర్చిన ఈ కొత్త కమిటీ స్వభావం గురించి తనకు ఏమీ అర్థం కావడం లేదంటూ దాపరికం తెలియని మన బిషన్ సింగ్ బేడీ పెదవి విరిచారు. బేడీ వంటి వ్యక్తు లకే ఈ విషయం అర్థం కానప్పుడు మరెవరికి అర్థమవు తుంది? వాస్తవమేమిటంటే, మాజీ ఆటగాళ్లను తన పక్షాన ఉంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. కామెంటేటర్లుగా ఉంటూనే బోర్డు కోసం చేసిపెడుతున్న అనిర్దిష్టమైన పనికి గానూ సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ఇద్దరూ బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయల విలువైన వార్షిక ఒప్పందాలకు సమ్మ తించిన విషయం తెలిసిందే. ఇది పత్రికల్లో రాగానే వారిరు వురు నసుగుతూ వివరణ ఇచ్చారు కానీ అది ఎవరినీ మెప్పించలేకపోయింది. ఈరోజు రవిశాస్త్రి అనధికారికంగానే కావచ్చు కానీ వేతనం తీసుకుంటున్న బీసీసీఐ ప్రతినిధి గానూ, తటస్థ వ్యాఖ్యాతగానూ ఉంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడైతే టీమ్ డెరైక్టర్‌గా కూడా ఉంటున్నాడు (ఇది సరికొత్త ఫ్యాన్సీ టైటిల్‌గా కనబడుతోంది కానీ ఇంత వరకు ఇలాంటిది ఉనికిలో లేదు).
 
 బీసీసీఐ ఇలాంటి విషయాల్లో ఎలాంటి వరసలను పాటించదు. కొద్దిమంది వ్యక్తుల బృందం ప్రతిదాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వీరిలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయనేతలూ అయితే మరికొందరు మాజీ క్రికెటర్లు. కాని ఈ బృందం మరీ చిన్నదిగానూ, గోప్యమైనదిగానూ ఎందుకుంటోంది? కారణం ఏమిటంటే ఈ బృందం పూర్తిగా కుంభకోణాలతో కూడుకున్నది. ఐపీఎల్ వ్యవస్థాప కుడు అయిపు లేకుండాపోయాడు. ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు బెట్టింగుకుగాను జైలుపాలయ్యాడు. ఐపీఎల్ టీమ్ లలో చాలా వరకు యాజమాన్యం, ఇతర వ్యవహారాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పట్టుబడి నిషేధాల పాలయ్యారు.
 
 దీన్నంతా మార్చడానికి ఎవరు నడుం కడుతున్నారు? ఎవ్వరూ లేరు. ఆటను మెరుగుపర్చడానికి తనదైన ప్రయ త్నం చేస్తున్నట్లు బీసీసీఐ ఎప్పుడైనా ప్రకటించిందా అంటే నాకు అనుమానమే. వాస్తవం చెప్పాలంటే బీసీసీఐ డబ్బును సృష్టించే ఒక యంత్రం. గతంలో గుజరాత్ క్రికెట్ అధ్యక్షు డిగా ఉండిన నరేంద్రమోదీతోపాటు రాజకీయనేతలందరూ ఈ డబ్బు తయారీ కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుకుం టున్నారు.
 
 క్రికెట్‌లో క్రమబద్ధీకరణ, పారదర్శకత విషయంలో ప్రత్యేకించి బీసీసీఐకి పేలవమైన రికార్డు ఉంది. ఇక కామధే నువులా మారిన ఐపీఎల్ విషయంలో దాని రికార్డును చెప్ప నవసరం లేదు. ఒక పత్రిక అయితే ఈ విషయాన్ని ఇప్పటికే నివేదించింది కూడా. దిగ్గజ త్రయంతో ఏర్పరచిన కొత్త ప్యానెల్‌ని ఐపీఎల్‌పై అభిప్రాయం అడుగుతారనుకోవడం కల్లోమాటే అన్నదే ఆ వార్త. అలాంటప్పుడు సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లను ఎందుకు ఆహ్వానించినట్లు?
 
 ఈ విషయానికి సంబంధించి నా అంచనా ఏమిటంటే, విశ్వసనీయమైన ఇన్‌సైడర్లు తన ప్రభావ పరిధికి వెలుపల ఉండిపోవడం ప్రమాదకరమని బీసీసీఐ భావిస్తోందేమో. ఇలాంటి మేటి క్రికెటర్లను వెలుపల ఉంచడం కంటే తన శిబి రంలో ఉంచుకోవడం చాలా మంచిదని అది భావిస్తుండ వచ్చు కూడా. ఇలాంటి చర్య ద్వారా బీసీసీఐ సీనియర్ కావచ్చు లేదా జూనియర్ కావచ్చు టీమ్‌ను మెరుగుపర్చడంపై ఎలాంటి ఆలోచనలను దృష్టిలో పెట్టుకున్న దాఖలాలు లేవు. స్వీయ రక్షణే దాని ఉద్దేశమన్నది స్పష్టం.
 ఆటగురించి బాగా తెలిసిన మాజీ ఆటగాళ్లకు మరింత పని కల్పించడంపై నిజంగా బీసీసీకి శ్రద్ధ ఉన్నట్లయితే, తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సయ్యద్ కిర్మాణి చేసిన ఆరోపణను అది ఎందుకు పట్టించుకోలేదు?
 
 దీనికి కారణం బహుశా కిర్మాణిని ఇవ్వాళ కొద్దిమంది మాత్రమే గుర్తు పెట్టుకోవడమే కావచ్చు. టెండూల్కర్ వంటి మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలకే బీసీసీఐ భయపడు తున్నట్లుంది. ఇండియన్ బోర్డు లోపల ఉన్న అవినీతి, బంధుప్రీతి గురించి సచిన్ నోరు విప్పితే ప్రేక్షకుల దృష్టిలో బీసీసీఐ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే బోర్డు సచిన్‌ను తన శిబిరం లోపల ఉంచుకోవాలనుకుం టోంది. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నప్పటికీ బీసీసీఐని అంతిమంగా కాపాడటమే ఒప్పందం నిజస్వభావమని ద్రావిడ్ గుర్తించబట్టే అతడు బీసీసీఐ ప్రతిపాదనను తిర స్కరించి ఉంటాడని నా అభిప్రాయం. బీసీసీఐ నియమించు కున్న సలహా మండలిని ఈ దృష్టిలోంచే పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికున్న సచ్చరిత్ర కారణంగా సంస్థ పట్ల విశ్వాసాన్ని ప్రోది చేయాల్సిన బాధ్యత పూర్తిగా వారిమీదే ఆధారపడి ఉంది మరి.
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
 - ఆకార్ పటేల్

Advertisement

తప్పక చదవండి

Advertisement