Sakshi News home page

కశ్మీర్‌లో కాషాయ కలకలం

Published Fri, Nov 21 2014 12:23 AM

కశ్మీర్‌లో కాషాయ కలకలం - Sakshi

కశ్మీర్ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీకి అతి పెద్ద సవాలు. ఆయన ఇంతవరకు సాధించిన విజయాలొక ఎత్తయితే జమ్మూ కశ్మీర్‌లో రేపు సాధించనున్న ఫలితం ఒకెత్తు. కశ్మీర్ లోయలో బీజేపీ పాగా వేసిందంటే మోదీ మంత్రజాలానికి సమీప భవిష్యత్తులో తిరుగులేదన్నమాటే.
 
మరో నాలుగు రోజుల్లో జమ్మూ కశ్మీర్  శాసనస భకు తొలి దశ పోలింగ్ జరగనుంది. కానీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కానీ నేటివరకు తమ ఎన్నికల ఎజెం డా, విధానాలపై మేనిఫెస్టోను విడుదల చేయ లేదు. ముఖ్య కార్యక్రమాలతో బిజీగా ఉన్నామని, వరద పునరావాస పనుల్లో ఉన్నామని, జాతీయ నేతలు రావాలని అన్ని పార్టీలూ సాకులు చెబుతు న్నాయి. నవంబర్ 25న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుండగా, డిసెంబర్ 2, 9, 14, 20 తేదీల్లో తదుపరి దశల ఎన్నికలు జరుగనున్నాయి.
 
మరోవైపు రాష్ట్రంలో ప్రచార కార్యక్రమం పుం జుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆక ర్షించడానికి ప్రచారం ముమ్మరం చేశాయి. గత ఆరే ళ్లుగా తమ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని నేషనల్ కాంగ్రెస్ (ఎన్‌సీ) పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రయత్నిస్తుంటే, పాలక కూటమి వైఫల్యాలను ఎత్తిచూపి ఓటర్లను ప్రభావి తం చేయడానికి అక్కడి ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ అభ్యర్థులు ప్రయ త్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని సిక్కుల అభివృద్ధి కోసం పీడీపీకి ఓట్లేయాలని శిరోమణి అకాలీదళ్ సిక్కు మతస్తులకు పిలుపునిచ్చింది.
 
గంపెడాశల కమలం

కశ్మీర్‌లో ఈ దఫా త్రిముఖ పోటీ ఉంటుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఒకవైపు, ప్రతిపక్ష పీడీఎఫ్ మరో వైపు, ఆశల పల్లకీలో భారీ అవకాశాలను చూస్తున్న బీజేపీ మరోవైపు తలపడుతున్నాయి. అనుకున్నం తగా అభివృద్ధి చేయలేకపోయామని ముఖ్యమంత్రి ఒమర్ చేసిన ప్రకటనతోటే ఈ సారి ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి గెలుపుపై సందేహం మొదలైంది. (గత ఎన్నికల్లో ఈ కూటమి వరుసగా 28, 17 స్థానాలు సాధించింది.) ఈ నేపథ్యంలో పీడీపీ మెజారిటీ స్థానాలపై దృష్టి పెట్టింది. సర్వేలు కూడా ఆ పార్టీకి ఆశలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపున బీజేపీ ఈ దఫా కశ్మీర్‌పై భారీ ఆశలను పెట్టుకుంది. కశ్మీర్‌లో హిం దూ అభ్యర్థుల స్థానంలో ముస్లింలకు సీట్లు ఇచ్చి వ్యూహాత్మకగా పావులు కదిపింది. కశ్మీరులో పాగా వేయడానికి నరేంద్రమోదీ జనాకర్షణ సాక్షిగా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
 
మోదీ మంత్రం - ఆర్టికల్ 370

ఒకరకంగా చెప్పాలంటే మోదీకి తన రాజకీయ జీవి తంలోనే ఇదొక అత్యంత కష్టమైన సమరం. ఆయన ఇంతవరకు సాధించిన విజయాలొక ఎత్తయితే జమ్మూ కశ్మీర్‌లో రేపు సాధించే ఫలితం ఒకెత్తుగా నిలబడుతోంది. ఎందుకంటే కశ్మీర్ లోయలో బీజేపీకి ఎలాంటి పునాదీ లేదు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయాలని బీజేపీ సుదీర్ఘకా లంగా డిమాండ్ చేస్తూవస్తోంది. అయితే కశ్మీర్‌పై పట్టు సాధించే ఉద్దేశంతో ఈ దఫా ఎన్నికల్లో ఆర్టికల్ 370పై తన వైఖరిని కాస్త సడలించుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో ప్రస్తావించవలసిన అవసరంలేదని తాజాగా పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ఈ సారి జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని మార్చేశారు. రెండు ప్రాంతీయపార్టీలూ, కాంగ్రెస్‌పార్టీ చుట్టూనే తిరుగాడే రాష్ట్ర ఎన్నికల చిత్రాన్ని  కదిలించి వేశారు. మాజీ వేర్పాటువాద నేత సజ్జద్‌లోనే ఈ వారం మోదీని కలిసి, కశ్మీర్ భాగ్యరేఖలను ప్రధాని మార్చి వేస్తారని కితాబివ్వటం చిన్నవిషయం కాదు.. గత సెప్టెంబర్‌లో వరద బీభత్సంలో చిక్కుకున్న కశ్మీర్‌కు వరాలు కురిపించిన ప్రధాని మోదీ అక్కడి యువ తపై తనదైన ప్రభావం వేశారు. వరద సహాయక చర్యల్లో ఒమర్ ప్రభుత్వం చేష్టలుడిగిపోగా కేంద్రం భారీ సహాయ చర్యలు చేపట్టడం సామాన్య ప్రజ లను కదిలించింది.
 
సర్వేతో పెరిగిన ఆశలు

రాష్ట్ర అసెంబ్లీలో 87 స్థానాలుండగా బీజేపీ ఈ దఫా అత్యధిక స్థానాల్లో గెలవనుందని, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 44 స్థానాలకంటే తక్కు వగానే ఆ పార్టీకి వస్తాయని ఈ వారం ఒక పోల్ సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ హిందూ ఆధిక్యత ఉన్న జమ్మూ లో, బౌద్ధుల ఆధిక్యత ఉన్న లడఖ్‌లో మెజారిటీ సీట్లు ఈసారి తమ వశం కావచ్చని బీజేపీ ఆశిస్తోం ది. ముస్లిం మెజారిటీ ఉన్న కశ్మీర్‌లో కొన్ని స్థానాలు గెల్చుకుంటే 30 స్థానాలవరకు తమ పరమవుతా యని, స్వతంత్ర అభ్యర్థులకు గాలంవేస్తే 44 స్థానాల మ్యాజిక్ నంబర్ సాధించడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ వ్యూహకర్తల భావన. ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తెచ్చి, అభివృద్ధిపై ప్రచారంతో ప్రత్యర్థులపై గురిపెట్టే వ్యూహాన్ని బీజేపీ కశ్మీర్‌లో అమలు చేయనుంది. ‘ఇప్పుడు నడుస్తోంది అభి వృద్ధి మంత్రం. కాశ్మీర్‌లో అభివృద్ధి కోసం ఆరాటం దేశం మొత్తంలో కంటే కాస్త అధికంగానే ఉంది. మోదీతో భుజం కలిపి సాగే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోరుకుంటున్నాం’ అని బీజేపీ వ్యూహకర్త రామ్ మాధవ్ చెప్పిన మాటల సారాంశం సుబోధకమే. ఇంతకూ కశ్మీరులో మోదీ మంత్రజాలం ఫలిం చేనా? హిమవత్పర్వత సానువుల్లో కమలం వికసిం చేనా? యావత్ భారతం ఈ ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూస్తోంది మరి.
 
- కె. రాజశేఖరరాజు
 

Advertisement
Advertisement