ఈవెంట్స్ | Sakshi
Sakshi News home page

ఈవెంట్స్

Published Mon, Apr 17 2017 2:00 AM

literature events in various places

వేమన సాహిత్యంపై సదస్సు
‘ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన సదస్సు’ను ఏప్రిల్‌ 30న అనంతపురంలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తెలియజేస్తున్నారు. ఉదయం 10 నుంచీ రాత్రి 8 వరకు నాలుగు సెషన్లుగా జరిగే ఈ సదస్సులో ‘వేమన సాహిత్యం– సమాజం’, ‘వేమన సాహిత్యం– ప్రాసంగికత’ అంశాలపై పలువురు ప్రసంగిస్తారు. వేమనపై 15 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ప్రజాకవి వేమన రూపకాన్ని ప్రజానాట్యమండలి ప్రదర్శిస్తుంది. వేదిక: పద్మావతి ఫంక్షన్‌ హాల్‌(రాజా, రమణ, రమేశ్‌ సినిమా హాలు), పాతవూరు, అనంతపురం. వివరాలకు: 9490122229.

బతుకమ్మ ఆవిష్కరణ
కూతురు రాంరెడ్డి కథల సంకలనం ‘బతుకమ్మ’ ఆవిష్కరణ, అంకితోత్సవం ఏప్రిల్‌ 18న సాయంత్రం 6:15కు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్లో జరగనుంది. స్వీకర్త: కె.వి.రమణ. అయాచితం శ్రీధర్, పత్తిపాక మోహన్, మామిడి హరికృష్ణ, డి.సురేశ్‌ కుమార్, కె.పి.అశోక్‌ కుమార్‌ పాల్గొంటారు.

ఆం.ప్ర. రచయితల సంఘం వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు మే 13, 14 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయి. కొత్త పుస్తకాల ఆవిష్కరణ, శతాధిక కవిసమ్మేళనం, కవులకు సన్మానం లాంటి కార్యక్రమాలుండే ఈ వేడుకల్లో పాల్గొన దలచినవారు ఏప్రిల్‌ 20లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు: 9247475975.

కథల పోటీ ఫలితాలు
ఫిబ్రవరిలో నిర్వహించిన అల్లూరి (గట్టు) నరసింగ రావు స్మారక కథల పోటీల్లో మంథా భానుమతి, తమ్మెర రాధిక, కన్నెగంటి అనసూయ వరుసగా 1, 2, 3 బహుమతులు గెలుచుకున్నారని నిర్వాహకులు లక్ష్మీ రాఘవ తెలియజేస్తున్నారు.

ధరిత్రి బహుమతుల ప్రదానం
ధరిత్రి సాహితీ మిత్రుల సంగమం నిర్వహించిన పోటీల్లో నాయిని గోవర్ధన్‌ రెడ్డి, సుంకరి ప్రవీణ్‌ కవిత్వానికిగానూ, తిరుమలశ్రీ, ఉషారాణి కథలకుగానూ బహుమతులు గెలుచుకున్నారు. ప్రదానం ఏప్రిల్‌ 30న మహబూబాబాద్‌లో.

యానాంలో పొయెట్రీ వర్క్‌షాపు
డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.కె. ప్రభుత్వ కళాశాల, కవిసంధ్య సంయుక్తంగా మే 20, 21 తేదీల్లో ‘యానాం పొయెట్రీ వర్క్‌షాపు’ నిర్వహించనున్నాయి. ఆసక్తిగలవారు తమ ఫొటో, బయోడేటా, ఇటీవల రాసిన మూడు కవితలతో ‘దాట్ల దేవదానం రాజు, 8–1–048, జిక్రియా నగర్, యానాం–533469’ చిరునామాకు ఏప్రిల్‌ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ఫోన్‌: 9440105987

Advertisement

తప్పక చదవండి

Advertisement