ఉసూరుమంటున్న ఉన్నత విద్య | Sakshi
Sakshi News home page

ఉసూరుమంటున్న ఉన్నత విద్య

Published Mon, Jan 5 2015 1:30 AM

ఉసూరుమంటున్న ఉన్నత విద్య - Sakshi

ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలను వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులను సమర్ధ మానవ వనరులుగా తీర్చిదిద్దే విద్యను చిన్నచూపు చూడటం సిగ్గుచేటు. ఉన్నత విద్య పెనుభారాన్ని వదిలించుకొనే ఉద్దేశంతో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తెరపైకి తీసుకురావడం దురదృష్టకరం.
 
గత నెల 18, 19 తేదీలలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడిం చిన అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా ప్ర మాణాలు మెరుగుపర్చేందు కు విదేశీ విశ్వవిద్యాలయాలను నెల కొల్పుతామని సీఎం ప్రకటించా రు. ప్రభుత్వ ఉన్నత విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 21 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నా యి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలి గానీ విదేశీ విశ్వవిద్యాలయాల ను స్థాపించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు?
 
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆర్థిక వనరులు, బోధన, బోధనేతర సిబ్బంది, సరైన మౌలిక వసతులు లేక నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పబడిన కొత్త విశ్వవిద్యాలయాల పరిస్థితి ఐతే మరీ దీనంగా తయారైంది. కనీసం సొంత భవనాలు లేక, బోధన, బోధ నేతర సిబ్బంది లేక డిగ్రీ కళాశాల భవనాలలో అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. తెలుగుదేశం  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా, విశ్వవిద్యా లయాలను వేధిస్తున్న ఈ సమస్య పట్ల ఏ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. ఈ మధ్య సీఎం వైస్ చాన్స లర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా ఈ సమస్యల ను, వాటి పరిష్కార మార్గాలను గూర్చి కనీసం ప్రస్తావిం చలేదు.
 
విశ్వవిద్యాలయాలను నాలెడ్జి సెంటర్లుగా, ఎడ్యుకే షన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొంటున్నారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీలుగా ఉన్న అసిస్టెంట్, అసోసి యేట్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా విశ్వ విద్యాలయాలను ఎడ్యుకేషన్ హబ్‌లుగా మారుస్తామని ప్రకటించడం నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది. విశ్వ విద్యాలయాలలో బోధన సిబ్బంది లేకపోవడంతో పరిశో ధన విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. తమను గైడ్ చేసే పర్యవేక్షకులు లేకపోవడంతో పరిశోధనలు సకాలంలో పూర్తి కాక స్కాలర్లు ఏళ్ల తరబడి విశ్వవిద్యాల యాలలోనే కాలం గడుపు తున్నారు. ఒక్కొక్క పర్యవేక్షకు ని కింద అనేక మంది పరిశోధక విద్యార్థులు ఉండటంతో, ఆయా పర్యవేక్షకులు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేక పోతున్నారు.
 
సార్వత్రిక ఎన్నికలకు ముందే విక్రమ సింహపురి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆ పోస్టుల మౌఖిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఈలోపు ఆయా విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్ల పదవీ కాలం ముగియడం, కొత్త  వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మళ్లీ కొత్త వీసీలు వచ్చేదెప్పుడో? ఆ పోస్టుల భర్తీకి మోక్షం ఎప్పుడో? అట్లే గత జూన్‌లోనే కృష్ణా విశ్వవిద్యాలయం కూడా బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ చివరి మాసంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా బోధన, బోధనేతర సిబ్బంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు వర్శిటీల్లో భర్తీ ప్రక్రియ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్క డే అన్న చందాన ఉంది.  యూజీసీ, ఉన్నత విద్యాశాఖలు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీ పట్ల ఆసక్తి కనబర్చడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి జాప్యం ఎందుకు జరుగుతుందో సీఎం సమాధానం చెప్పాలి.
 
యూజీసీ నిబంధనలకు అనుగుణంగా విద్యాప్రమా  ణాలు, పాలన భవనాలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల నాణ్యత పతనావస్థలో ఉంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,050.64 కోట్లు కేటాయించారు. ఇందులో పది సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు రూ.712.14 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు వాటి అభివృద్ధికి ఎంత మాత్రం సరిపోవు. ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలను వృథా చేస్తున్న మన ప్రభుత్వం విద్యార్థుల ను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దే విద్యను చిన్న చూపు చూడటం సిగ్గుచేటు. ఉన్నత విద్యపై వెచ్చించాల్సిన నిధులు భారీస్థాయిలో ఉన్నందున క్రమేణా భారాన్ని వది లించుకొని, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు వీలు గా ప్రైవేటు విశ్వ విద్యాలయాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల పేదవారికి ఉన్నత విద్య గగన కుసుమంగా మారుతుంది.

స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం విద్యకు, అందు లో ఒకటిన్నర నుంచి రెండు శాతం ఉన్నత విద్యకు కేటా యించాలని జాతీయ విజ్ఞాన సంఘం సూచించింది. విద్య కోసం ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కోట్లాది రూపా యలు ప్రతి సంవత్సరం ప్రజల నుంచి సుంకం పేరిట వసూలు చేస్తున్న ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం శోచనీయం. ప్రభుత్వం ఇప్పటి కైనా కళ్లు తెరిచి వాస్తవాలను గమనించి విశ్వవిద్యా లయాలలో సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్ప న తదితర అంశాలపై దృష్టి సారించాలి. ముందు ఉన్న విశ్వవిద్యాలయాల అభివృద్ధిని గూర్చి, సమస్యల పరిష్కా రాన్ని గూర్చి ఆలోచించి నానాటికీ నిర్వీర్య మవుతున్న ఉన్నత విద్యను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి.

(వ్యాసకర్త తెలుగు అధ్యాపకులు, తెనాలి)

Advertisement
Advertisement