నిన్న పన్సారే.. నేడు కల్బుర్గి.. రేపు ఎవరి వంతు? | Sakshi
Sakshi News home page

నిన్న పన్సారే.. నేడు కల్బుర్గి.. రేపు ఎవరి వంతు?

Published Sat, Sep 12 2015 12:58 AM

నిన్న పన్సారే.. నేడు కల్బుర్గి.. రేపు ఎవరి వంతు? - Sakshi

తమకు నచ్చిన దేవుళ్లను పూజించుకునే స్వేచ్ఛనూ, మెచ్చిన మతాలను అనుసరించే హక్కును పౌరు లకు మన రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుళ్ల పట్లా, మతాల పట్లా నమ్మకం లేని పౌరుల భావాలకు కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. భక్తులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఫాదర్లు, పాస్టర్లు, ఉలేమాలు, బిక్షువులతోపాటు హేతువాదులు, నాస్తి కులు, భౌతికవాదులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ను రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కులను కాల రాసే హక్కు ఎవరికీ లేదు.
 
 ప్రముఖ హేతువాద ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్‌ను 2013లో హిందుత్వశక్తులు హత్య చేశా యి. మతమౌఢ్యాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా ప్రచా రం చేసిన గోవింద పన్సారే (సీపీఐ నేత)ను కూడా 2015లో అవే శక్తులు హత్య చేశాయి. ఈ ఇద్దరూ మహారాష్ట్రీయులే. తాజాగా 30-08-2015న కర్ణాట కలోని ధార్వాడ్‌లో ప్రముఖ హేతువాద ఉద్యమకా రుడు, సాహితీవేత్త మల్లేశప్ప కల్బుర్గిని హత్య చేశా రు. ఈ ముగ్గురూ వృద్ధులే. తాము నమ్మిన విశ్వా సాల పట్ల నిబద్ధ సేవకులే. ఈ ముగ్గురినీ హత్య చేసింది హిందుత్వ శక్తులే.
 
 పైగా హత్య చేసిన పద్ధతి కూడా ఒకేమాదిరిగా ఉంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదాలపై దాడి, సైన్స్ మీద దాడి, సమాజ శాస్త్రంపై దాడి, మన రాజ్యాంగంపై దాడి. భారత జాతి జనుల గుండెల్లో వెలుగొందుతున్న భగత్సింగ్ నాస్తి కుడే, భారత తొలి ప్రధాని నెహ్రూ తనకు అతీతశక్తులపై నమ్మకంలేదని ప్రకటించిన వాడే. లోహియా, జయ ప్రకాశ్‌లదీ అదేమాట. కరుణానిధితో సహా ద్రావిడ ఉద్యమ పునాదులతో ఎదిగిన నేతలదీ అదేబాట. ఇక తెలుగు చలనచిత్ర నటులు అక్కినేని తన జీవితాంతం హేతువాదే. కమ ల్‌హసన్‌దీ అదే దారి. నార్ల వెంకటేశ్వరరావు నుంచి ఏబీకే వరకూ ప్రముఖ సంపాదకులందరూ హేతు వాదులే. తెలుగునాట త్రిపురనేని, సి.వి. నుంచి గోరా వరకు ఇదే పాయలో కొనసాగినవారే. హేతు వాద, భౌతిక ఉద్యమాలు సమాజంలో ఒక మేధో ప్రవాహంగానే ఉన్నాయి. అలాంటి మెదళ్లకు మేకు లుకొట్టి నిర్మూలించాలని కలలు కన డం మూర్ఖత్వం మాత్రమే.
 
 హేతువాద, భౌతికవాద ఉద్య మాలకు 3 వేల ఏళ్ల చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడికంటే ముందున్న చార్వాకులు, లోకాయతుల నుంచి బుద్ధుడు, మహావీరుడు, వేనరాజు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, ది గ్నాగుడు, వంటి తాత్వికులు, మధ్య యుగాల్లో బ్రహ్మనాయుడు, బస వన్న, తర్వాత వీర బ్రహ్మం, వేమన, కబీరు, మీరా బాయి, చైతన్యుడు వంటి సంస్కర్తలు, ఆధునిక యుగారంభంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, గురజాడ, కందుకూరి వంటి సంస్కర్తలు హేతువాదానికి ఆయా కాలాల్లో ప్రాతి పదికను కల్పించినవారే. భారతీయ సామాజిక జీవ నంలో ఎప్పటినుంచో ఉన్న హేతువాద, భౌతికవాద ఉద్యమాలపై ఈ హైటెక్ యుగంలో తుపాకీ దాడు లేమిటి?
 
 నిజానికి ఇది మతావలంబకులకీ, మత రహి తులకీ మధ్య వివాదం కాదు. ఇది ప్రజాస్వామ్యా నికీ, నిరంకుశత్వానికీ మధ్య వివాదం మాత్రమే. హిందుత్వశక్తుల హత్యా రాజకీయాలను ఇలాగే కొనసాగనిద్దామా? ఈ నేలమీద నాజీయిజాన్ని పెర గనిద్దామా? రేపు మన గ్రామ పొలిమేరలకూ, పట్ట ణ శివార్లకూ హత్యా రాజకీయాల విస్తరణకు అను మతించుదామా? మన విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాలనూ పుణే, ధార్వాడ్, ఔరం గాబాద్‌లుగా మార్చనిద్దామా? అలా కాకూడ దను కుంటే గొంతులన్నీ ఏకం చేసి మానవహారంలో పాల్గొందాం. కొవ్వొత్తులతో దభోల్కర్, పన్సారే, కల్బుర్గిల అమరత్వానికి నివాళులర్పిద్దాం.
 (నేటి సాయంత్రం గం.6.30లకు విజయవాడ లెనిన్ సెంటర్‌లో మానవహారం సందర్భంగా...)
 ఎ.రవిచంద్ర  ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ)  
 మొబైల్: 9492274365

Advertisement

తప్పక చదవండి

Advertisement