ఎనిమిది పదుల రంగస్థలం రావి చలం | Sakshi
Sakshi News home page

ఎనిమిది పదుల రంగస్థలం రావి చలం

Published Wed, Sep 23 2015 1:41 AM

ఎనిమిది పదుల రంగస్థలం రావి చలం

‘‘సంసార స్త్రీలు సాహసించి నాటకరంగ ప్రవేశం చేశారంటే, వారి సహకారంతో ప్రదర్శితమయ్యే నాటకాలు ఏ వృత్తి నాటకాలకు తీసిపోవు’’ అని తాను ప్రగాఢంగా విశ్వసించడమే కాకుండా, ఆచరిం చి చూపిన ఆదర్శ నట దర్శకుడు రావి వెంకటచలం. ‘స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న’ బళ్లారి రాఘవ నినా దం ఆంధ్ర నాటక రంగ చరిత్రలో ఓ విప్లవమైతే, కుటుంబ స్త్రీలను నాటక రంగ ప్రవేశం చేయించిన ఆర్.వి.చలం ఆచరణ అనితర సాధ్యమైనదిగా ఈ నాటికీ ఔత్సాహిక నాటకరంగ చరిత్రలో ఓ సువర్ణా ధ్యాయంగా మిగిలి ఉంది.
 
 చలం పూర్వీకులు ఉమ్మడి విశాఖ జిల్లా బొబ్బి లి ప్రాంతానికి చెందిన వారు. తండ్రి ఉద్యోగ రీత్యా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఉండగా చలం అక్కడ జన్మించారు. 1933లో పదిహేనేళ్ల వయసులో కాళ్లకూరి నారాయణరావు రచించిన ‘వరవిక్రయం’లో పెళ్లిళ్ల పేరయ్య పాత్రతో నాటక నటనకు శ్రీకారం చుట్టారు. ఆ పాత్రలో వయసుకు మించిన ప్రతిభ కనబరిచారు. ఆ నాటకంలో ప్రవే శం ప్రాతిపదికగానే 1983లో మద్రాసు తెలుగు అకా డమీ వ్యవస్థాపకులు టి.వి.కె. శాస్త్రి.. ఆర్.వి.చలం నట జీవిత స్వర్ణోత్సవం నిర్వహించారు.
 అంతకుముందు హైస్కూలు స్థాయి లోనే చలం నటించిన షెరిడన్ రచన డా. ఫాస్టస్ ఆంగ్ల పాత్రాభినయాన్ని మెచ్చు కుంటూ, నాటి ప్రముఖ నటుడు, రచయి త డా. చాగంటి సన్యాసిరాజు (సామర్ల కోట) బహూకరించిన షేక్స్‌పియర్ నాట కాలు, తన ఆంగ్లభాషాభివృద్ధికి, తదనం తర కాలంలో అతని జీవనభృతికి ఎంతో తోడ్పడ్డాయి. జమ్‌షెడ్‌పూర్‌లో 1938లో ఒకసారి రావి వెంకటచలం నటించిన షేక్స్‌పియర్ ‘జూలి యస్ సీజర్’ నాటకాన్ని నాటి కాంగ్రెస్ అగ్రనేతలైన బాబూరాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, రాధాకమల్ ముఖర్జీలు చూశారు. చలం నటనకు ముగ్ధులైన ఆ నేతల సిఫార్సుతోనే చలంకు టాటా కంపెనీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆయన అక్కడే స్థిరపడిపోయారు. చలం తన ఇద్దరు కుమా ర్తెలను, మనుమరాలిని కూడా తన నాటకాలలో నటింపజేశారు. బంధు వులు, స్నేహితులెందరో.. సంసారాల్లోని ఆడపిల్లల కు నాటకాలేమిటి? పెళ్లిళ్లు కావు అని భయపెట్టినా పట్టించుకోలేదు. అంతే కాదు తెలుగు అసలు తెలియని చలం కుమార్తెలు హిందీ లిపిలో సంభాషణ లు రాసుకుని అద్భుతంగా నటించి అనేక బహుమతులు గెల్చుకున్నారు.
 
 ఆయన ఎన్నో ఉత్తమ నాటిక, నా టకాల ఏకపాత్రలు రచించినా తను రాసిన తొలి నాటకం ‘మాటతప్పకు’ ప్రదర్శన వేలాది ప్రేక్షకులు, నాటక నిపుణుల ప్రశంసలు పొందింది. సుప్రసిద్ధ నటులు స్థానం నరసింహారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, కె. వెంకటేశ్వరరావు, డా. గరికపాటి రాజారావు, సీహెచ్.కృష్ణమూర్తి, డా.కె.వి.గోపాలస్వామి వంటి వారు, ఆ నాటక ప్రదర్శనకు, అందులోని మాన వీయ సందేశానికి ముగ్ధులయ్యారు. ‘‘రిహార్సల్స్‌ను మనం గౌరవిస్తే... నాటకం దానంతట అదే గౌరవం సంపాదించుకుంటుంది’’ అని నమ్మే ఆయన నాటక ప్రదర్శన కంటే, రిహార్స ల్‌కే అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. నాటకాన్ని, నట నను ఒక తపస్సులా భావించే ఆర్.వి.చలం, నాటక నటులకుండే సాధారణ వ్యక్తిగత బలహీనతలు లే కుండా, ఎనిమిది పదుల నట జీవితం కొనసాగిం చడం అరుదైన అంశం.
 
 1978లో ఉద్యోగ విరమణ అనంతరం, 2000 సంవత్సరం విశాఖ వచ్చి స్థిరపడిన చలం తన నూర వ ఏట కూడా ఎంతో ఆరోగ్యంగా అలనాటి జ్ఞాప కాలు వల్లెవేస్తుంటారు. ఆ ఏడే ఆయన రచించిన డెబ్భై ఏడేళ్ల నాటకానుభవం’ పుస్తకం సమకాలీను లైన సాంఘిక నాటకరంగ దిగ్గజాలను, తొలితరం పౌరాణిక నట ప్రముఖులను మన కళ్లముందు ఆవి ష్కరిస్తుంది. అలాగే 2005లో రచించిన ‘హెయిల్, అమ్మ’ ఆంగ్ల పుస్తకంలో తన జీవితంలో ఎదురైన చిన్నచిన్న సంఘటనలు, వాటిని వ్యక్తిగత, నటజీవి తంలో అన్వయించుకున్న విధానం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే. తన తొంభై ఏళ్ల వయసులో రాసిన చిన్ననాటి జ్ఞాపకాలతోపాటు, తన అనుభ వాలు చలంలోని అసాధారణ జ్ఞాపకశక్తిని తేటతెల్లం చేస్తాయి. నూరవ ఏట అడుగుపెట్టినా ఈ నాటికీ ఎంతో ఆరోగ్యం, అవగాహన కలిగిన అగ్రశ్రేణి నట దర్శకుడు ఆర్.వి.చలం జీవితం నేటితరం నటీ నటు లకు ఆదర్శనీయం.
 (నేడు చలం సంప్రదాయక శత జన్మదినోత్సవం)
 బి.వి.అప్పారావు  విశాఖపట్నం, 9347039294

Advertisement
Advertisement