Sakshi News home page

స్టేషన్ బెయిల్ రద్దు?

Published Wed, Sep 16 2015 12:18 AM

స్టేషన్ బెయిల్ రద్దు? - Sakshi

 స్టేషన్ బెయిల్ విధానం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని కూడా పత్రికల్లో రాస్తున్నారు. మీడియాలో పోటీ పెరిగి న్యాయకోవిదులను విచారించకుండానే వార్తలు రాస్తున్నారు. ఇది సరైంది కాదు.
 
 స్టేషన్ బెయిల్ రద్దయిందని వారం రోజులుగా చాలా వార్త లు వచ్చాయి. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సెక్షన్ 41ఏ నుంచి 41 డిలను తొలగించారని చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ వార్తలు న్యాయవాదుల్లో, న్యా యమూర్తులో,్ల పోలీసుల్లో గం దరగోళం సృష్టిస్తున్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవ రణల చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా ఈ నిబంధనలని చట్టంలో ఏర్పాటు చేశారు. ఇవి 1 నవం బర్ 2010 నుంచి అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 41ఏ ప్రకా రం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్షను విధించే అవ కాశం ఉన్న కేసుల్లో లేదా ఏడు సంవత్సరాల వరకు శిక్ష ను విధించే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టు చేయకుండా హాజరుకమ్మని నోటీసులని పోలీసులు ఇస్తే సరిపోతుం ది.
 
 ఆ నోటీసు ప్రకారం ఆ వ్యక్తి నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీలులేదు. ఆ నోటీసు ప్రకా రం వ్యవహరించలేదని పోలీసు అధికారి భావించినప్పు డు తగు కారణాలను నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. కొన్ని ప్రత్యేక కారణాలు రాసి కూడా ముద్దాయిలను అరెస్టు చేయవచ్చు. ఈ నిబంధన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని కష్టాలూ ఉన్నా యని అనుభవంలో తేలింది.
 
 ఇదిలా ఉంటే - కేంద్ర ప్రభుత్వం రిపీలింగ్ అండ్ అమెండింగ్ (సెకండ్) యాక్ట్, 2015 (తొలగింపు మరి యు సవరణల (రెండవ) చట్టం, 2015) ద్వారా, అదే విధంగా తొలగింపు మరియు సవరణల చట్టం 2015 ద్వారా చాలా చట్టాలని తొలగించింది. అందులో క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్ సవరణల చట్టం, 2008 కూడా ఉం ది. ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా అరెస్టు నిబంధనలకి చేసిన సవరణలు, చేర్చిన కొత్త నిబం ధనలు తొలగిపోయాయని అందరూ తప్పుగా భావించి స్టేషన్ బెయిల్ రద్దయిందని అనుకుంటున్నారు. మీడి యా ఇలాంటి వార్తలని ప్రచురించి, ప్రసారం చేసి గంద రగోళం సృష్టించింది. ఈ గందరగోళానికి తెరదించా లన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
 
 ఈ తొలగింపు మరియు సవరణల ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ చట్టాల్లోని సెక్షన్ 4ని అదే విధంగా జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 6ఏని చదవాలి. వాటి ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ గందరగోళం ఏర్పడదు. జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం - ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాసనాన్ని తొలగిస్తే ఆ తొలగించిన చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు తొలగిపోవు. అవి తొలగించిన ట్టుగా ప్రత్యేకంగా చెప్పినప్పుడు మాత్రమే అవి తొలగి పోతాయి. జనరల్ క్లాజెస్ చట్టంలోని 6ఏ ప్రకారం సవ రణల చట్టాలు తొలగిపోతాయి. ఆ సవరణల చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు అలాగే ఉంటాయి. అంతే కాదు అవి సంబంధించిన వాటిని పరిపాలిస్తాయి.
 
 ‘‘కూడా బక్ష్ వర్సెస్ మేనేజర్ కెలెడోనియన్ (ఏఐ ఆర్ 1954 కలకత్తా 484)’’లో ఇదే విషయం చర్చకు వచ్చింది. ఆ కేసులో కలకత్తా కోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది. ‘‘తొలగింపు చట్టాల ఉద్దేశం వేరు. ఆ సవరణల చట్టం ద్వారా మూల శాసనంలో చేరిన నిబంధనలని తొలగించటం కాదు. వాటిని ప్రభావితం చేయడం కాదు. దేశంలో చట్టాల పరిమాణాలని తగ్గించడం ఈ చట్టాల ఉద్దేశం. మూల చట్టంలో చేరిన సవరణలు, కొత్తగా చేరిన నిబంధనలు మూల చట్టంలో భాగమైపో తాయి. దాంతో సవరణ చట్టం ఉద్దేశ్యం నెరవేరుతుంది. అందుకని ఆ సవరణల చట్టం ఉనికి ఇంకా అవసరం ఉండదు. అలాంటి రక్షించే నిబంధనల తొలగింపు చట్టంలో ఉంటుంది.’’ సవరణల చట్టం ద్వారా కొత్త నిబంధనని చేర్చినా, ఉన్న నిబంధనలకి సవరణలని చేసి చట్టాలను తొల గించడం కోసమే కేంద్ర ప్రభుత్వం తొలగింపు సవరణల చట్టాలని తెస్తాయి.
 
 కేంద్ర ప్రభుత్వం మరియు తొలగింపు సవరణల చట్టం, 2015 ప్రకారం 35 సవరణల చట్టాలని తొలగిం చారు. రెండు సవరణల చట్టాల్లో మార్పులు చేశారు. అదే విధంగా తొలగింపు సవరణల (రెండవ) చట్టం 2015 ద్వారా 90 సవరణల చట్టాలని తొలగించారు. రెం డు సవరణ చట్టాల్లో మార్పులు తెచ్చారు.
 మీడియాతో బాటు న్యాయవాదులు, న్యాయమూ ర్తులు భ్రమపడుతున్నట్టు అరెస్టు చట్టాలు శాసనంలో ఉన్నాయి. పోలీసుల అధికారాలు పోలేదు. అయితే అది స్టేషన్ బెయిల్ కాదు.
 
 సెక్షన్ 41ఏ నుంచి 41 బి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో అరెస్టు చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఈ నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరు చేసే అధికారం పోలీసులకి లేదు. మీడియా అనవసరంగా స్టేషన్ బెయిల్ అని ఉదహరిస్తుంది.
 
ఇకపోతే బెయిలబుల్ (బెయిల్ హక్కుగా పొందే వీలున్న నేరాలు) నేరాల్లో పోలీసులు విధిగా ముద్దాయి లకు బెయిల్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. నాన్ బెయిలబుల్ నేరాల్లో బెయిల్ మంజూరు చేసే అధికారం పోలీసులకి లేదు. నాన్ బెయిలబుల్ నేరాల్లో ఎవరినైనా అరెస్టు చేసిన తరువాత ఆ ముద్దాయి నాన్ బెయిలబుల్ నేరం చేశాడనడానికి సహేతుకమైన కారణాలు లేవని పోలీసులు భావించినప్పుడు మాత్రమే క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లోని సెక్షన్ 437(2) ప్రకారం బెయిల్ మం జూరు చేయవచ్చు.  అంటే! వార్తలు ప్రచురించే ముందు, వార్తా కథ నాలు ప్రసారం చేసే ముందు సంబంధిత విజ్ఞులను సం ప్రదిస్తే మంచిది. లేకపోతే గందరగోళం సృష్టించిన వాళ్లుగా మిగిలిపోతారు.
 వ్యాసకర్త డెరైక్టర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ మొబైల్: 94404 83001
 - మంగారి రాజేందర్

Advertisement

తప్పక చదవండి

Advertisement