Sakshi News home page

ఉగ్రవాదులకు ఉరే సరి..!

Published Mon, Aug 3 2015 12:32 AM

మహేష్ విజాపుర్కార్

ఉరిశిక్షను ఏ సందర్భాల్లో విధించవచ్చు అనే అంశంపై ఎన్ని  చర్చలు, వాదనలు అయినా జరగనివ్వండి. కానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం శిక్ష తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కొనసాగుతున్న స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో భాగమవుతున్న ఉగ్రవాదులని చివరికంటా శిక్షించాల్సిన అవసరం ఉంది.
 
 భారత్‌లో ప్రతి రోజూ ఎవ రో ఒకరిని ఎక్కడో ఒకచోట ఉరి తీయడంలేదు. గత పదేళ్లలో దేశంలో ముగ్గురిని మాత్రమే ఉరి తీశారు. గడిచిన ఏడేళ్లలో దేశంలో 3,751 మంది నేరస్తులకు పడిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు.
 యాకూబ్ మెమన్ విషయంలో తీవ్రాతితీవ్రమైన శిక్ష విధింపును అధిగమించేందు కోసం న్యాయస్థానాలు, రాష్ట్రపతి కూడా తగు జాగ్రత్తతో వ్యవహరించారు. ఉరి శిక్షకు పాత్రులైన వారి విషయంలో ఎలాంటి తప్పూ జర గకుండా చూడాలనే అంశాన్ని ధ్రువీకరిస్తూ.మెమన్ పిటిషన్‌ను వినడానికి కనీవినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు ధర్మాసనం అర్ధరాత్రి నుంచి వేకువజాము దాకా సమావేశమైంది.
 
 అత్యంత అరుదైన కేసులకు మాత్రమే ఉరిశిక్ష విధిం పు వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ, ఉరిశిక్షపై సమీక్షకు సంబంధించిన డిమాండ్‌ను తిరస్కరించలేరు. న్యాయ మూర్తుల వివేచన సైతం తప్పులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టే ఉన్నత న్యాయస్థానాల్లో వారి ఆదేశాలపై సమీక్షల కారణంగా అనేక ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలు గా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశం అకాలంలో చర్చకు తీసుకున్నందువల్ల మొత్తం చర్చ కలుషితమవుతోంది.
 అదెలాగో ఇక్కడ చూద్దాం. కోల్‌కతాలో ఒక రేపిస్టుకు ఉరిశిక్ష విధించినప్పుడు ఈ చర్చ తారస్థాయికి వెళ్లింది. అలాగే నిర్భయ కేసు ప్రజల హృదయాలలో ప్రముఖంగా నిలిచి ఉన్నప్పుడు, శాసనంలో కొన్ని మార్పులకు అది కారణమైంది. తాను చేసిన నేరాలకు తన జీవితాన్ని పరిత్యజించానని యాకుబ్ మెమన్ పేర్కొన్న తర్వాతే ఉరికి వ్యతిరేకంగా జనాగ్రహం పెరిగి పోయింది. అయితే మెమన్ చేసినవి చిన్న నేరాలు కావు.
 
 న్యాయవ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభిప్రా యంచేత ప్రభావితం కాకూడదు. అలా కాదనే భావి ద్దాం. ఉరిశిక్షను ఒక శిక్షా సాధనంగా రద్దు చేయవలసిం దిగా ప్రముఖులు అభ్యర్థించిన సందర్భంలో ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం మిన్నంటుతోంది. ఈ అంశం పై సమాచారాన్ని అరకొ రగా పొందుతున్నవారు ఇలాంటి అభ్యర్థనలను అపరాధులను కాపాడేదాంట్లో భాగంగా అనుమానిస్తున్నారు. ఉరి శిక్ష రద్దుకు వారు చర్చిస్తున్న సందర్భం అసలు లక్ష్యాన్ని పక్కకు నెడుతోంది.
 
 అందుకే ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలని నా సూచన. మనం మొదట్లో చట్టాలను రూపొందించుకున్న ప్పుడు ఉగ్రవాదం ఉనికిలో లేదు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన పేలుళ్ల కారకులు దేశద్రోహులే. వారు మరణశిక్షకు అర్హులే. ఇలాంటి వారికి మరణశిక్ష విధించ కపోతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరా టాన్ని అది బలహీనపరుస్తుంది.
 
 అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించకపోవడాన్ని ఒక సారి ఊహించుకోండి. అతగాడి విచారణ సమయంలో సైతం కసబ్‌ని రక్షించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందం టూ నిఘావిభాగాలు పేర్కొన్నాయి. ఈ భయాల కార ణంగానే కసబ్‌ను ఉంచిన జైలు పరిసరాల్లో ఎత్తైన భవ నాలు నిర్మిచడాన్ని అనుమతించలేదు. విచారణను సైతం జైలులోపలే జరిపారు. దాన్ని ఉక్కుకోటలాగా మార్చారు.  
 
 ఉగ్రవాదంపై పోరులో మరణశిక్ష విధింపుకు ప్రాధాన్యత ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. ఉగ్రవాదంపై పోరు పలురకాలుగా జరుగుతుంది. అవన్నీ కలసి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో సాయప డతాయి. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడమనేది వాటిలో ఒకటి. నిఘా సంస్థల నుంచి అనిర్దిష్ట హెచ్చరికలు పంపటం తప్ప, ఈ విషయంలో మాత్రం మనకు ఘన మైన రికార్డు ఏదీ లేదు. రెండు. మనం ఉగ్రవాదంతో వ్యవహరించేందుకు సిద్ధంగా లేము. ఎందుకంటే క్షమిం చకపోవడం అనే సంస్కృతి మనకు లేదు.
 
 మూడవ కారణం ఏదంటే హింస అనేది అత్యంత తీవ్ర స్వభావం నుంచే విస్తరిస్తుంది. అత్యంత చిన్న ఐఈడీలు సైతం దీపావళి టపాసుల స్థాయిలో ఉండవు. పేలుడు ఘటనలలో పాల్గొన్నవారు పట్టుబడితే న్యాయ విచారణ ప్రక్రియ తర్వాత వారికి బదులుకు బదులు చెప్పాలని మన సాధారణ తర్కం చెబుతుంది. ఒక అమాయకుడు ఉగ్రవాద బాధితుడు అయినట్లయితే, వ్యూహకర్తలు చెప్పింది చేసే అత్యంత కిందిస్థాయి ఉగ్ర వాదులకు సైతం తగిన శాస్తి చేయాలి. ఉగ్రవాద చర్యల్లో ముఖ్యమైనవని, తక్కువ స్థాయివని తేడా ఉండదు. ఒక ఉగ్రవాద చర్యకు పాల్పడటానికి ముందు ఉన్మాదులు అత్యంత పకడ్బందీగా పథక రచన చేస్తుంటారని గుర్తుంచుకోవాలి.
 
 సంప్రదాయిక యుద్ధాల్లో సైతం పౌరులపై దాడి చేయకూడదని నియమాలు ఉంటాయి. విషవాయు ప్రయోగాలు చేయకూడదని నిషేధాలు కూడా ఉంటా యి. వియత్నాం యుద్ధం తర్వాత నాపాం బాంబులను కూడా నిషేధించారు. ఇలాంటి ఆయుధాలు తుపాకుల వంటివి కాదు. వీటి ప్రభావం విస్తృత స్థాయిలో ఉండి సామాన్యులను, ఏ ప్రమేయంలేని పౌరులను బలిగొంటుంది. ఇలాంటి క్రూర ప్రపంచంలో పౌరులను చంపడం, నిరుత్తరులను చేయడమే ఉగ్రవాద లక్ష్యంగా ఉంటుంది. అలాంటి దాడులపై కఠిన చర్యలు చేపట్టాలి. మరణ దండన వాటిలో ఒకటి.
 
 అయితే మరణ దండన ఉగ్రవాద దాడులను తగ్గిం చగలదా? తగ్గించలేకపోవచ్చు కానీ ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని అది సజీవంగా ఉంచుతుంది. భద్రతపరం గా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మనలాంటి దేశాల్లో ఎవ్వరైనా, ఎక్కడివారైనా ఉగ్రవాదులకు లక్ష్యం గా ఉంటారు. ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అసమర్థత కారణంగా ఉగ్రవాదంపై కనీస సానుభూతి కూడా ఉండకూడదనే మాటలు శుష్క ప్రసంగాలే అవుతాయి. ఉగ్రవాద దాడుల్లో పాల్గొనేవారు తమ జీవితాలు పట్టుబడిన తర్వాత కూడా కొనసాగుతాయని తెలుసు కాబట్టే వారు ఉగ్రవాదాన్ని కౌగలించుకుంటుంటారు.


 అయితే అన్ని రకాల చర్యలకు ఉరితీతే ఉత్తమ శిక్షా మార్గం అనడానికి వీలు లేదు. ఉరిశిక్షను ఏ సందర్భాల్లో విధించవచ్చు అనే అంశంపై ఎన్ని  చర్చలు, వాదనలు అయినా జరగనివ్వండి. కానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం శిక్ష తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కొన సాగుతున్న స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో భాగమ వుతున్న ఉగ్రవాదులని చివరికంటా శిక్షించాల్సిన అవసరం ఉంది.
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్:mvijapurkar@gmail.com))
 

 

Advertisement

What’s your opinion

Advertisement