Sakshi News home page

విప్లవ జీవితానికి ఒరవడి

Published Sun, Nov 9 2014 1:54 AM

విప్లవ జీవితానికి ఒరవడి

ప్రతిఘటనా పోరాట సేనాని, భారత విప్లవోద్యమ అగ్రనాయ కులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి మూడు దశాబ్దాల క్రితం 1984 నవంబర్ 9వ తేదీన అమరులయ్యారు. మరణించే నాటికి ఆయన రహస్యజీవితంలో ఉంటూ సీపీఐ (ఎంఎల్) పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఆయన చూపిన పోరాట మార్గం అనుసరణీయం, ఆచరణీయం. సీపీ కర్నూలు జిల్లా వెలుగోడులో 1917 జూలై 1న జన్మించారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమ పోరాటంలో పాల్గొన్నారు.

మద్రాసు లోని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి సంఘ కార్యక్ర మాల్లో చురుకుగా పాల్గొన్న సీపీ కళాశాలలో బహిష్కరణకు గురై, ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేయడానికి వెళ్తూ అరెస్టయి జైలుకి వెళ్లాడు. తెలంగాణ పోరాట విరమణను తీవ్రంగా వ్యతిరేకించాడు. 1952లో మద్రాసు అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాలో జరిగిన అనేక భూస్వామ్య వ్యతిరేక పోరాటా లకు నాయకత్వం వహించారు.     
    
1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయే సందర్భంలో రాజకీయ పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించి చైనా మద్ద తుదారుడుగా ముద్రపడి, దేశ రక్షణ చట్టం కింద 1964లో అరెస్టయి రెండేళ్లు జైలు జీవితం గడిపారు. జైల్లో  ఉన్న సమ యంలో మాణికొండ సుబ్బారావుతో కలిసి  ‘ప్రపంచ కమ్యూ నిస్టు ఉద్యమం దాని పరిణామం’ అనే గ్రంథా న్ని రాశారు. చైనాలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘చైనా, రష్యా వాదనలు’ అనే పేరు తో అక్షరరూపం ఇచ్చారు. అదే సమయంలో సీపీఎంతో వచ్చిన విభేదాలతో దేవులపల్లి వెంక టేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంక య్యలతో కలిసి బరద్వాన్, పాలకొల్లు ప్లీనం లలో సీపీఎం సిద్ధాంతాలను ఎండగట్టారు.

సీపీఎం నుంచి తెగతెంపులు చేసుకొని, విప్లవ పంథాను ఆచరణలో పెట్టేందుకు 1968 నవం బర్‌లో ములుగు అడవిలో ఉద్యమానికి పునాది వేసారు. అడ విలో ప్రజలను సమీకరించి సాయుధ దళాలను నిర్మాణం చేసి విప్లవోద్యమంలో ఒక కీలక భూమికను పోషించారు. శ్రీకాకుళ ఉద్యమంతో తిరిగి సజీవ సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు అఖిల భారత స్థాయిలో ఉద్యమాన్ని విస్తరింపజేయ డానికి సత్యనారాయణ సింగ్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించారు.

1975లో కామ్రేడ్ సీపీ, సీపీఐ (ఎంఎల్) కేంద్రకమిటీ సభ్యుడయ్యాడు. 1979లో కామ్రేడ్ సత్యనారాయణసింగ్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ అయ్యాడు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. కామ్రేడ్ సీపీ 1975కి పూర్వం, 1975లో కేంద్ర కమిటీకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు  రూపొందించడంలో ప్రముఖ భూమిక పోషించారు. తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుం డా విప్లవ పార్టీకి ప్రాథమికంగా, సాపేక్షికంగా సరైన కార్యక్రమాన్ని, పంథాను రూపొందిం చడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.

సీపీ తన జీవిత కాలమంతా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తీసుకొని, అప్పటికే పట్టణాలకు బహిరంగ కార్యక్రమాలకు, ఎన్నికలకు పరిమితమైపోయి ఆదివాసీలను, దళితులను నిర్ల క్ష్యం చేస్తున్న రివిజనిస్టు రాజకీయాలను కేవలం వ్యతిరేకం చడం మాత్రమే కాకుండా ఆచరణలో వాటిని నిరూపించడానికి వరంగల్, ఖమ్మం ఆదివాసీలు నివసించే అడవిని కార్యరం గంగా ఎంచుకున్నారు. సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సిద్ధిస్తుందని భావించి విప్లవ సైన్యానికి బీజరూపమైన సాయుధ దళాల నిర్మాణానికి ఆ అడవిని కేంద్రం చేసుకున్నాడు.

అడవి, అడవిలోని ఆదివాసీలను సమీకరించడం ద్వారా పట్ట ణాలు, గ్రామాల మీద ప్రభావం కలిగించవచ్చునని భావిం చాడు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఆదివాసీలను సమీకరించి వారి హక్కుల కోసం నిలకడగలిగిన ఉద్యమాన్ని నిర్మించారు. ఆ విధంగానే ఎమర్జెన్సీకి ముందుగానే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దళితులను, పేదలను సమీకరించే కార్యక్రమం చేపట్టారు.

అదే సమయంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా  యూని వర్సిటీ విద్యార్థులను విప్లవోద్యమం వైపు ఆకర్షించి రాష్ర్టవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి మార్గం చూపారు. 1978 తర్వాత కరీం నగర్ జిల్లాలో సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతంలో దొరలకు వ్యతి రేకంగా సాగిన  రైతాంగ పోరాటానికి ప్రత్య క్షంగా, పరోక్షంగా నాయకత్వం వహించారు. తెలంగాణలో వందల, వేలమంది విప్లవ కార్యకర్తలను, లక్షలాది మంది ప్రజలను పోరాట బాట పట్టించిన ఘనత చండ్రపుల్లారెడ్డిదే.

ఆయన నాటిన విప్లవ భావాలు ఈ నాడు సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో అడుగ డుగునా ప్రతిఫలిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన కొద్ది మంది మార్కిస్టు లెనినిస్టు సిద్ధాంత కర్తల్లో చండ్ర పుల్లారెడ్డి ప్రముఖులు. భారత విప్లవోద్యమంలో ఆచ రణ, సిద్ధాంతం రెండింటినీ జోడించి విప్లవోద్యమాన్ని నిర్మిం చిన చండ్ర పుల్లారెడ్డి చిరస్మరణీయుడు.

(నేడు చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి)
చిట్టిపాటి వెంకటేశ్వర్లు
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement