ఏమైంది స్వదేశీ? | Sakshi
Sakshi News home page

ఏమైంది స్వదేశీ?

Published Sat, Feb 7 2015 1:10 AM

where is Swadeshi?

ఇటీవల గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ పారిశ్రామికవేత్తల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు కొంత ఆందోళనకరంగాను, ఇంకొన్ని మోదం కూర్చేవిగాను ఉన్నాయి. పదిలక్షల కోట్ల రూపాయలను గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం హర్షణీయమే. ఆ పెట్టుబడులు ఆ రాష్ట్రం శరవేగంగా పురోగతి సాధించ డానికి దోహదపడే మాటవాస్తవం. అయితే ఈ పెట్టుబడులలో సింహ భాగం విదేశీ కంపెనీల నుంచి రావడం మంచి పరిణా మం కాదు. ప్రపంచీకరణ తరువాత దేశంలోకి చొరబడు తున్న బహుళ జాతిసంస్థల వలన దేశ ప్రగతి విషయం లో మన ప్రభుత్వం పట్టు సడలిపోతోంది. విదేశీ సం స్థలు దేశంలోని వనరులను ఉపయోగించుకుని, వాటిని ఇక్కడే విక్రయించి లాభాలను మాత్రం ఆయా కంపెనీల సొంత దేశాలకు తరలిస్తున్నాయి. దీని వలన మన దేశానికి వచ్చే లాభం ఏమిటి? ఇదంతా బీజేపీ అధికారంలో ఉండగా జరగడమే విచిత్రం. స్వదేశీ అంటూ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిన పార్టీ ఇప్పుడు ఇలాంటి ధోరణులకు పాల్పడడం దారుణం. దేశీయమైన పెట్టుబడులతోనే దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఆ పార్టీ ఉల్లంఘించింది. ఇది సరికాదు.
 
 సీహెచ్. సాయి రుత్విక  నల్లగొండ
 

Advertisement
 
Advertisement
 
Advertisement