సైన్స్ ఎందుకు రాశాం? | Sakshi
Sakshi News home page

సైన్స్ ఎందుకు రాశాం?

Published Fri, Dec 12 2014 8:04 AM

why we wrote the science ?

ఇన్ బాక్స్: శాస్త్ర విజ్ఞానం అందరికీ చెందాలని ప్రయత్నించిన తెలుగు రచయి తలు ఎందరో ఉన్నారు. జనరంజక విజ్ఞాన వ్యాసాలు మాత్రమే కాక, సైన్స్ ఫిక్షన్ విభాగంలో విజ్ఞానానికి కల్పనా చాతురి జోడించి కథలు, నవలలు, నాటకాలు కూడా రాసిన సృజనాత్మక సాహితీ వేత్తలు కూడా ఉన్నారు. సైన్స్ రచయితలు ఏ నేపథ్యంలో, ఏ ఉద్దేశాలతో ఈ రం గంలో రచనను ప్రారంభించారో తెలుసుకోవడం ఆసక్తికరంగానే కాదు, ప్రేరణాత్మకంగా కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్య కథనాలను సంక లనం చేయాలని తలంచాం. ఇప్పటికే కొంతమంది తమ వ్యాసాలు పంపారు. మాకు తెలిసిన, మావద్ద సమాచారం లేని రచయితలు కూడా ఈ పత్రికా ప్రకటననే ఆహ్వానంగా పరిగణించి వ్యాసం పంపా లని మనవి.

సైన్స్ రచనలనే పంపగలరు. రేపటి తెలుగు సైన్స్ రచనా దీపాన్ని జేగీయమానం చేయడానికి, రేపటి రచయితల కోసం రాస్తు న్నారని గమనించగలరు. జనవిజ్ఞాన వేదిక ప్రచురించే ఈ పుస్తకం ప్రతిని ప్రచురణ తర్వాత పంపగలం.

మీ రచనలు పంపాల్సిన చిరునామా: జి.మాల్యాద్రి, ప్లాట్ నంబర్- 162, విజయలక్ష్మినగర్, నెల్లూరు,
ఆంధ్రప్రదేశ్ -524004.మొబైల్: 9440503061, ఈమెయిల్: malyadrig1955@gmail.com
రచనలు చేరడానికి చివరి తేదీ: 2015, జనవరి 26
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్  ఆకాశవాణి ప్రయోక్త

Advertisement
Advertisement