Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 16th Politics Latest News Updates In Telugu
May 16th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 16th AP Elections 2024 News Political Updates9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్‌మెంట్‌కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్‌కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్‌ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-‍ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

YSR Congress accuses Election Commission of bias
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు

సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరిక­ట్టేం­దుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధా­రా­లను అందచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నా­గాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేత­లు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్య­ల­కు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకో­వాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడు­తుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతు­న్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పు­డు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచ­నల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది. కొందరు పోలీసు అధికారులు టీడీపీ­తో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేక­పోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్‌ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్‌ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.దాడులు.. ఆపై కేసులు: పేర్ని నానిటీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్‌ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్‌ అధికారిని పోలీస్‌ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు’రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరు­గు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మె­ల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ము­ఖేష్‌­కుమార్‌ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్‌ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు.

Nepal Cricketer Sandeep Lamichhane Acquitted By Patan HC: Report
సందీప్‌ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు?

క్రిమినల్‌ కేసు నుంచి నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానేకు హైకోర్టు లో పెద్ద ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్‌ హైకోర్టు రద్దు చేసింది.నేపాల్‌ మాజీ కెప్టెన్‌ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.బెయిల్‌పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లమిచానే నేపాల్‌ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టి20లు ఆడి 98 వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్‌ జట్టులోఇక సందీప్‌ లమిచానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ​కాగా, ఇప్పటికే నేపాల్‌ క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.టీ20 ప్రపంచకప్‌-2024 కోసం నేపాల్‌ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.

Betting On andhra pradesh elections
‘హలో అప్పారావ్‌.. ఏంటి పరిస్థితి!’

హలో.. అప్పారావ్‌!.. నేను రాజుబాబుని మాట్లాడుతున్నాను. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందనుకుంటున్నారు? అవతల పార్టీ అభ్యర్థికి ఎన్ని పడుంటాయ్‌? అయితే మన పార్టీ కేండిడేట్‌ గెలుపు గ్యారంటీ అన్న మాట! అది సరే.. స్టేట్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? నీకున్న సమాచారం ఓ సారి చెప్పు!’ అని అడిగే సరికి ఆ రాజుబాబు తనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్నింటిని జోడించి అక్కడ వాళ్లు గెలుస్తున్నారు.. ఇక్కడ వీళ్లు గెలుస్తున్నారంటూ టకటకా చెప్పేస్తున్నాడు. మధ్యమధ్యలో అప్పారావుకొచ్చిన డౌట్‌లను నివృత్తి చేస్తూ ఫలితాలను ముందే ప్రకటిస్తున్నాడు. ఇలాంటి అప్పారావులు, రాజుబాబుల్లాంటి వారు చాలామంది ఈ పనిమీదే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే సాగిస్తున్నారు. పోలింగ్‌ ముగిశాక అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపైనే అందరి దృష్టి ఉంది. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ కనిపిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అంతేకాదు.. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి ఎన్నికల ఫలితాలెలా ఉంటాయన్న దానిపైనే మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రజలకంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు వీటిపైనే చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? వాటిలో గెలుపు అంశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై బేరీజు వేస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువతీ యువకులు ఎవరికి వేశారోనని ఆరా తీస్తున్నారు. దానిని బట్టి ఫలానా అభ్యరి్థ/పార్టీ గెలుస్తుందని, లేదా ఓటమి పాలవుతారని అంచనాకొస్తున్నారు. ఇలా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు. లెక్కలు, అంచనాల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు టీవీల్లోను, సోషల్‌ మీడియాలోను, యూట్యూబ్‌ ఛానల్స్‌లోనూ ఇప్పటికే అనధికారికంగా ఎగ్జిట్‌ పోల్స్‌ పేరిట ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయన్నది జోస్యం చెప్పేస్తున్నారు. ఆయా పార్టీల శ్రేణులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు వీటిని ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఈ ఎన్నికల్లో తమదే శాస్త్రీయమైన సర్వే అని చెప్పుకుంటూ తమ అభిమాన పారీ్టకి అనుకూలంగా ఫలితాలను ఇస్తున్నారు. మరికొందరైతే అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూల ఫలితాలనే కూటమికి వస్తున్నట్టు తారుమారుగా చూపిస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో వ(ఇ)స్తున్న అనధికార అంచనా ఫలితాలు జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో తమ నమ్మకస్తులకు ఫోన్లు చేసి సందేహ నివృత్తి చేసుకుని ఒకింత ఊరట చెందుతున్నారు. వ్యతిరేక ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిస్తే ఆందోళనకు గురవుతున్నారు. టీవీలు, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో వస్తున్న సొంత అంచనాల ఫలితాలతో ఇప్పటికే బెట్టింగులకు దిగిన వారు మరింత టెన్షన్‌ పడుతున్నారు. బెట్టింగులపై కూటమిలో బెరుకు.. మరోవైపు పోలింగ్‌కు ముందు కూటమి అభ్యర్థులదే గెలుపంటూ పందాల కోసం హడావుడి చేసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గారు. తొలుత 1:2,3 బెట్టింగులకు సిద్ధమన్న వారిప్పుడు 1:1కి కూడా ముందుకు రావడం లేదు. ఏదోలా తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నా.. పందాల దగ్గరకు వచ్చేసరికి పలాయనం చిత్తగిస్తున్నారు. మొత్తమ్మీద అసలు ఫలితాలు వెలువడే జూన్‌ నాలుగో తేదీ వరకు ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు.

Slovakia PM Robert Fico Shot: Latest News
స్లోవేక్‌ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..

ప్రేగ్‌: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని, ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్‌ తరాబా మీడియాకు తెలిపారు.దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024ఇక కాల్పులకు సంబంధించి స్పాట్‌లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్‌ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబర్ట్‌ ఫికో గురించి.. 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్‌ ఫికో జన్మించారు.ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి పుతిన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.కమ్యూనిస్ట్‌ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్‌ లెఫ్ట్‌ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. 1990లో.. యూరోపియన్‌ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1999లో.. స్మెర్‌(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లో సభ్య దేశంగా మారింది. అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్‌ గ్యాంగ్‌లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. స్లోవేకియా ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌ జాన్‌ కుసియాక్‌తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.

Aishwarya Rai Injured, But Leaves For Cannes Film Festival 2024
గాయపడిన ఐశ్వర్య రాయ్‌.. అయినా అక్కడికి ప్రయాణం

ప్రతి సంవత్సరం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌. ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్‌ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్‌లో ఎలా నడుస్తుంది. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్‌ కార్పెట్‌పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్‌లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్‌ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్‌లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్‌ కార్పెట్‌పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్‌లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్‌లో పింక్ లుక్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Anita Goyal wife of Jet Airways founder Naresh Goyal passed away due to cancer
క్యాన్సర్‌తో నరేష్‌ గోయల్‌ భార్య కన్నుమూత

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్‌ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరిన అనితా మార్కెటింగ్ అండ్‌ సేల్స్ హెడ్‌గా ఎదిగిన తర్వాత నరేష్‌ గోయల్‌తో పరిచయం ఏర్పడింది. వారి కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్‌ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్‌గోయల్‌కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్‌ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.

Uday Nagaraju From Telangana Picked As Uk Labour Party Parliamentary Candidate
యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగు బిడ్డ

సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ లేబర్‌ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్‌ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్‌ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్‌ అనే థింక్‌ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్‌ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rohini Created A Virtual Village Named Raise A Child
‘రైజ్‌ ఏ చైల్డ్‌’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..

పాపాయి నిద్రపుచ్చినంతసేపు కూడా పడుకోలేదు. భుజానికెత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చి ఇలా మంచం మీద పెట్టానో లేదో వెంటనే లేచేసింది. ఈ బిడ్డతో నేనేం చేయను’ చంటిబిడ్డను పెంచే ప్రతి తల్లి నుంచి వినవచ్చే మాటే ఇది. ఆ తల్లి వెలిబుచ్చిన నిస్సహాయతలో అగాధం వంటి ఆవేదన దాగి ఉంటుంది. ఈపాట్లన్నీ పడిపాపాయిని ఆరు నెలలు పెంచేసరికి మెటర్నిటీ లీవ్‌ అయిపోతుంది.అప్పుడు మరో ప్రశ్న... ‘బిడ్డను కేర్‌ టేకర్‌ చేతిలో పెట్టి ఉద్యోగానికి వెళ్లవచ్చా. చక్కగా చూసుకోగలిగిన ఆయాలు దొరికితే బావుణ్ను’. బిడ్డకు ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్‌లు చెబుతారు, కానీ ఎలా తినిపించాలనేది మాత్రం బిడ్డను పెంచిన అనుభవం ఉన్న తల్లులే చెప్పాలి. పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెలిసిందో గ్రామం. దాని పేరే ‘రైజ్‌ ఏ చైల్డ్‌’. ఎక్కడ ఉందీ గ్రామం. ఈ గ్రామం అడ్రస్‌ చెప్పాలంటే కేరాఫ్‌ డిజిటల్‌ మీడియా అని చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు, నగరాల్లో అన్నీ న్యూక్లియర్‌ ఫ్యామిలీలే. పసిబిడ్డ అమ్మమ్మ, నానమ్మల చేతిలో పెరిగే అవకాశాలు తగ్గిపోయిన ఈ కాలంలో బిడ్డ సంరక్షణలో తల్లులకు ఎదురయ్యే సందేహాలను డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఒకరికొకరు షేర్‌ చేసుకుంటున్నారు. వివిధ ్రపాంతాల్లో ఉన్న తల్లులు ఇందులో జాయిన్‌ అయ్యారు. ‘క్వశ్చన్స్‌ అరౌండ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సపోర్ట్‌ ఫర్‌ ఇండియన్‌ మదర్స్, బేబీ లెడ్‌ వీనింగ్, గుడ్‌ షెడ్యూల్‌ ఫర్‌ బేబీస్, క్లాత్‌ డయాపరింగ్‌ ఇండియా, ఫస్ట్‌ ఫార్టీ డేస్‌ ఆఫ్టర్‌ చైల్డ్‌ బర్త్‌’ వంటి పది గ్రూప్‌లను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ ‘రైజ్‌ ఏ చైల్డ్‌’ పేరుతో ఒక వర్చువల్‌ విలేజ్‌కి రూప కల్పన చేసింది రోహిణి అనే మహిళ.‘‘నిజానికి నాకెదురైన సమస్యలే ఈ వర్చువల్‌ విలేజ్‌ రూపకల్పనకు నాంది. గర్భధారణ, ప్రసవం 30 ఏళ్లలోపు జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరవాతనే పెళ్లి. దాంతో పిల్లలను కనే వయసు దాటిపోతోంది. నేను 32 ఏళ్ల వయసులో గర్భం దాల్చాను. డాక్టర్‌ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం మళ్లీ డాక్టర్‌ చెకప్‌ వరకు ఆగలేం.అప్పటికీ రోజూ ఫోన్‌ చేసి అమ్మ, అత్తగారిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నానా లేదా అనే సందేహం. పాత తరం వారి అనుభవంతోపాటు కొత్తతరంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో సోషల్‌ మీడియాలో ఇన్ని వేదికలున్నాయని తెలిసింది. ఆ గ్రూప్‌ల అడ్మిన్‌లందరితో మాట్లాడి అన్నింటినీ ‘రైజ్‌ ఏ చైల్డ్‌’ గొడుగు కిందకు తీసుకువచ్చాను. గర్భిణులకు, కొత్త తల్లులకు ఇది ఒక వరంగా మారింది. ఇది మనదేశంలో ఉన్న వాళ్లకే కాదు, విదేశాల్లో ఉన్న మనవాళ్లకు కూడా ఉపయోగపడుతోంది. నిజానికి మనకంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఎందుకంటే ఐర్లాండ్‌లో ఉన్న ఒక మహిళ అక్కడి వైద్యవిధానాలు, వైద్యుల సూచనను యథాతథంగా పాటించింది. కానీ ఆ పద్ధతులుపాపాయికి సౌకర్యంగా అనిపించడం లేదని తెలిసి ‘రైజ్‌ ఏ చైల్డ్‌’లో చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒకరు తమ సమస్యనుపోస్ట్‌ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు’’ అని వివరించింది రోహిణి. రైజ్‌ ఏ చైల్డ్‌ మొత్తానికి కొత్త తల్లులకు పెద్దబాలశిక్ష అయింది. "ఇందులో ఒకరు తమ సమస్యను పోస్ట్‌ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు".

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement