135వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

135వ రోజు పాదయాత్ర డైరీ

Published Fri, Apr 13 2018 2:37 AM

135th day paadayatra dairy  - Sakshi

12–04–2018, గురువారం
మణిపాల్‌ హాస్పిటల్‌ ప్రాంతం గుంటూరు జిల్లా

ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తేవాలన్నదే నా ఆకాంక్ష
చంద్రబాబు భూ దాహానికి బలైన మరో కన్నీటి గాథ నా దృష్టికొచ్చింది. ఈ రోజు పాదయాత్రలో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె రవికిరణ్‌ తన తండ్రితో సహా కలిశాడు. వెలగపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో తాత్కాలిక సెక్రటేరియట్‌ గోడకు ఆనుకుని వాళ్లకు తాతల కాలం నుంచి 19.74 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం వేధిస్తోందట.

కుంటిసాకులతో పాసు పుస్తకా లు రద్దు చేసిందట. కోర్టుకెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా వదలడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసు బందోబస్తుతో అర్ధరాత్రిళ్లు దొంగత నంగా పనులు చేయిస్తున్నారని, అడ్డుపడిన తన తండ్రిని అనేక సార్లు గెంటేశారని రవికిరణ్‌ ఆవేశంతో రగిలిపోయాడు. రక్షించాల్సిన ప్రభుత్వమే దోపిడీ దొంగలా వ్యవహరిస్తుంటే ఇక సామాన్యుడిని కాపాడేదెవరు?

పాదయాత్రలో నన్ను కలిసిన శ్రీనివాసరెడ్డి ఓ చిరువ్యాపారి. తినీతినక కూడబెట్టిన రూ.5 లక్షలు కేశవరెడ్డికి అప్పుగా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఇద్దరు పిల్లలకు గుండె జబ్బట. దాచిన డబ్బులివ్వమంటే.. కేశవరెడ్డి బోర్డు తిప్పేశాడట. కష్టాలు చెప్పుకున్నా కనికరించలేదట. డబ్బులన్నీ ఇప్పిస్తానని భరోసా ఇచ్చిన ఓ మంత్రి ముఖం చాటేశాడట.

దిక్కు తోచని స్థితిలో గతేడాది సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. నెలల తరబడి ప్రయత్నం చేసి ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రిని కలిస్తే.. ‘ముగ్గురు పిల్లలకు రూ.50 వేల చొప్పున, నాకు మరో రూ.లక్ష ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.. కానీ ఇప్పటి వరకూ ఒక్క పైసా చేతికందలేదన్నా..’ అని ఆవేదన వ్యక్తంచేశాడు. ముఖ్యమంత్రి హామీకే దిక్కులేకపోతే ఇక ప్రజలను పట్టించుకునేదెవరు?

ముస్లిం మైనార్టీకి చెందిన 28 ఏళ్ల ఓ చెల్లెమ్మ కష్టం విని గుండె తరుక్కుపోయింది. ఆమె రెండు కిడ్నీలూ చెడిపోయాయి. ఆటో డ్రైవర్‌ అయి న భర్త కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమేనట. కానీ మార్పిడికి రూ.6 లక్షలవుతుందని డాక్టర్లు చెప్పారంది. ఆరోగ్యశ్రీ వర్తించే పరిస్థితే లేదు. సీఎం సహాయ నిధి కోసం స్థానిక ఎమ్మెల్యేని ఆశ్రయించగా.. అంత డబ్బు ఎవడిస్తాడనడంతో మరింత కుంగిపోయింది.

‘అన్నా.. నా కోసం కాదు.. నా బిడ్డ కోసం బతకాలనుంది’ అంటూ బావురుమన్న ఆ చెల్లి స్వరం గుండెను పిండేసింది. అందుకే నాన్నగారి హయాంలో పేదవాడికి భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తేవాలని, మరింత పటిష్టపరచాలన్న నా ఆకాంక్ష మరింత బలపడింది.ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తామని, పథకాన్ని మరింత పటిష్టపరుస్తామని గొప్పగా హామీ ఇచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఆ పథకం పేరు మార్చడం తప్ప సాధించిందేమైనా ఉందా? ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయడం వాస్త వం కాదా? మీ పాలనలో పేదవాడి ప్రాణాలు గాలిలో దీపాలేనా?

Advertisement

తప్పక చదవండి

Advertisement