విపత్కర పరిస్థితుల్లో నీచ రాజకీయాలా! | Sakshi
Sakshi News home page

విపత్కర పరిస్థితుల్లో నీచ రాజకీయాలా!

Published Sun, Apr 19 2020 4:39 AM

Alla Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) ధ్వజమెత్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న వేళ ప్రజలు భయబ్రాంతుల్లో ఉంటే వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లే విధంగా ఏదో మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందడం సిగ్గుచేటు అన్నారు. బాధ్యత మరిచి పక్క రాష్ట్రానికి వెళ్లి కూర్చున్న చంద్రబాబు ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. పరీక్షలను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను తెప్పించారు. 
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రశంసించారు. ఆయనను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.
► దేశంలో లక్ష సామర్థ్యంతో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు తెప్పించుకున్న ఏకైక రాష్ట్రం.. ఏపీ
► రాష్ట్రంలో అత్యాధునిక సదుపాయాలతో కొవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటుతో పాటు కొత్తగా 12 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. 
► రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకో కుండా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు.  
► క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న సదుపాయాలను పరిశీలించకుండానే విమర్శలు గుప్పించడం దారుణం.    
► బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి తిరుపతి క్వారంటైన్‌లో ఉంటూ 22 రోజుల అనంతరం డిశ్చార్జ్‌ అయిన తర్వాత స్టార్‌ హోటల్‌ సదుపాయాలు ఉన్నాయంటూ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement