నోటా మీట దడదడ! | Sakshi
Sakshi News home page

నోటా మీట దడదడ!

Published Tue, Nov 6 2018 3:41 AM

Anxiety in political parties on nota - Sakshi

పుట్టిన తొలి ఏడే నోటా హీటెక్కించింది. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో అధికార, విపక్షాలకు చుక్కలు చూపించింది. 2013 ఎన్నికల్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నోటా ఓట్ల పరంగా బీజేపీ, కాంగ్రెస్, ఓ ప్రాంతీయ పార్టీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. అందుకే ఈ నోటాపై ఇప్పుడు రాజకీయపార్టీల్లో ఆందోళన మొదలైంది.

2013 రాజస్తాన్‌ ఎన్నికల్లో బీజేపీకి 45.2%, కాంగ్రెస్‌కు 33.1% ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల జాబితాలో మూడోస్థానంలో స్వతంత్రులు (8.2%), ఇటీవలే ఎన్పీపీ (4.3%), బీఎస్పీ (3.4%)లు నాలుగైదు స్థానాల్లో నిలవగా.. నోటా 1.9% ఓట్లతో (5,90,000 ఓట్లు) ఐదో స్థానంలో నిలిచింది. నోటాకన్నా జాతీయ పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎంలకు తక్కువ ఓట్లు వచ్చాయి. 58 పార్టీలు పోటీచేసిన ఈ ఎన్నికల్లో..  54 పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌ గత ఎన్నికల్లో మూడోవంతు సీట్లలో నోటా మూడోస్థానంలో నిలవడమే ఇందుకు కారణం. 17 చోట్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కన్నా నోటా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. నోటా ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. అందుకే ప్రధాన పార్టీలు  తటస్థ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి.

17 నియోజకవర్గాల్లో నోటాకు 5వేలకన్నా ఎక్కువ ఓట్లొచ్చాయి. మొత్తంమీద 1.3 కోట్ల ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 41%, కాంగ్రెస్‌కు 40% ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా నోటా 3.1% (4లక్షలు)ఓట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఆర్టీఐ కార్యకర్త ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆయన నోటా ఓట్లను సరిగ్గా వాడుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement