కేజ్రీవాల్‌ నామినేషన్‌పై ఉత్కంఠ

21 Jan, 2020 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారమే నామినేషన్‌ దాఖలు చేయాలని చూసిన కేజ్రీవాల్‌.. భారీ రోడ్‌ షో కారణంగా అది కాస్త వాయిదా పడింది. దీంతో నేడు కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలు చేయడానికి జామ్‌నగర్ హౌస్‌లోని ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ 50 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు క్యూలో వేచిఉన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయడానికి నేడే చివరి రోజు కావడంతో.. ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారా లేదా అనేది ఈ సాయంత్రానికి తెలనుంది. 

ప్రస్తుతం కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలు చేసేందుకు క్యూలో వేచి ఉన్నారని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియాకు తెలిపారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం కేజ్రీవాల్‌ అందరిలాగానే క్యూ లైన్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. తమ కంటే ముందుగా కేజ్రీవాల్‌ను అనుమతించబోమని చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?

ఉత్తరాలు, ట్వీట్లు మానుకొని ముందుకు రండి

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబు?

సినిమా

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా