మహారాష్ట్ర గవర్నర్‌ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమావేశానికి గవర్నర్‌ ఆదేశం

Published Tue, Nov 26 2019 6:14 PM

BJP MLA Kalidas Kolambkar as Assembly Protem Speaker - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్‌ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షను నిర్వహించనున్నారు. 

మరోవైపు అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్‌ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్‌ శాసనసభ్యుడు కాళిదాస్‌ కోలంబకర్‌ను నియమించారు. నిబంధనలు ప్రకారం సభలో సీనియర్‌ సభ్యుడైన ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు సభకు ఎనిమిది సార్లు ఎన్నికయిన కాళిదాస్‌కు గవర్నర్‌ ఆ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, బలపరీక్షను నిర్వహించనున్నారు.

మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆలోపే ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి సిద్ధమయింది. కూటమి నేతగా ఉద్దవ్‌ ఠాక్రేను ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలువనున్నారు.

Advertisement
Advertisement