చంద్రబాబుకు ఎమ్మెల్సీ సవాల్‌ | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 11:49 AM

BJP MLC Somu Veerraju Challenge CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడేందుకు ఏ చానెల్‌లోనైనా బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రక్తంలోనే అవినీతి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు ఆ ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎంగిలి కాఫీ తాగే రకం చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అన్నింటిలో అవినీతి చేసే నువ్వూ.. నీ కొడుకు చివరకు టాయిలెట్లు, బాత్‌ రూమ్‌లను నాకేస్తున్నారు’ అని మండిపడ్డారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘పోలవరంను పీపీ పద్ధతిలో నిర్మించమని చట్టంలో పేర్కొన్నారు. 2014లో మొదలవ్వాల్సిన ప్రాజెక్టును రెండేళ్లపాటు నాన్చి 2016 చివర్లో ప్రారంభించారు. ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌ దినేష్‌కుమార్‌ రెండేళ్లు గోళ్లు గిల్లుకునేలా కూర్చోబెట్టారు. పోలవరం సొమ్మును ఒక కాంట్రాక్టర్‌ను పెట్టుకుని దోచుకోవడానికి చూస్తున్నారు. బాబు అబద్ధపు ప్రచారానికి మీడియా తెర దించాలి. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రెండుసార్లు వచ్చి పోలవరాన్ని సందర్శించారు. అయినా ప్రధాని మోదీ పోలవరం రాలేదంటారు. స్పిల్‌ వే నిర్మాణానికి రూ.1400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. కానీ దాని వ్యయం 1100 కోట్ల రూపాయలే’ అని అన్నారు. ప్రధాని మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకు లేదని అన్నారు. మోదీ ఏపీకి ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. నాడు దేశ అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement
Advertisement