ఉండమ్మా.. బొట్టు పెడతా! | Sakshi
Sakshi News home page

ఉండమ్మా...బొట్టు పెడతా!

Published Sun, Mar 31 2019 8:58 AM

BJP Political Campaign By Blob Stickers In Name Of Narendra Modi - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొత్త పోకడలు పోతున్నాయనడానికి నిదర్శనం ఈ ‘మోదీ బొట్టు’. మోదీ ఫొటో, బీజేపీ గుర్తు కమలంతో పాటు, ‘ఫిర్‌ సే మోదీ ఏక్‌బార్‌’ అన్న నినాదం కూడా ముద్రించి ఉన్న బిందీ (బొట్టు స్టిక్కర్లు) ప్యాకెట్‌ ట్విట్టర్‌లో హల్‌చల్‌  చేస్తోంది. పరాస్‌ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ రూపొందించిన ఈ మోదీ బిందీ ప్యాకెట్‌ ఫొటోను మహ్మద్‌ సలీమ్‌ అనే ఎంపీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కొద్దిసేపట్లోనే ఆ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది.

సలీమ్‌ మోదీ బిందీ ఫొటో పెట్టడంతో పాటు ‘పేటీఎం బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇప్పుడు పరాస్‌ ఫ్యాన్సీ బిందీపై కూడా ఉన్నారు. ‘మోదీ హైతో మంకిన్‌హై’ అన్న క్యాప్షన్‌ను కూడా జోడించారు. గతంలో రైలు టికెట్ల మీద, విమానం బోర్డింగ్‌ పాసుల మీద మోదీ ఫొటో రావడం తెలిసిందే. ఇప్పుడిలా బిందీల ప్యాకెట్‌పై కూడా మోదీ చోటు చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా హైదరాబాద్‌కు చెందిన ఒక జంట తమ పెళ్లి ఆహ్వాన పత్రికలో ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలం’టూ అతిథులకు లిఖితపూర్వకంగా విజ్ఞాపన చేసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement