బీజేపీ పాలన దేశానికి ప్రమాదకరం: రాఘవులు | Sakshi
Sakshi News home page

బీజేపీ పాలన దేశానికి ప్రమాదకరం: రాఘవులు

Published Thu, Nov 1 2018 5:08 AM

BV Raghavulu said BJP is the most dangerous party to the country - Sakshi

హైదరాబాద్‌: బీజేపీ పాల న దేశానికి అత్యంత ప్రమాదకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బు«ధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అక్రమాలు చేయడం ప్రారంభిస్తుందన్నారు. అవినీతిపరుడిని సీబీఐ అధికారి గా నియమించిందని, వెంటనే అతనిపై విచార ణ జరిపించాలన్నారు. సీట్ల పంపకం కోసమే మహాకూటమి ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

Advertisement
Advertisement