నన్ను రక్షించాల్సిన బాధ్యత మీదే | Sakshi
Sakshi News home page

నన్ను రక్షించాల్సిన బాధ్యత మీదే

Published Sat, Mar 30 2019 4:33 AM

Chandrababu Comments With Public In Election Campaign - Sakshi

రాజమహేంద్రవరం సిటీ/ తాడితోట/కొవ్వూరు: ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించారు. రానున్న రోజుల్లో పది సుత్రాలు అమలు చేస్తానని ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలనే  కొత్తగా ప్రకటించారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొవ్వూరు, కొత్తపేట, రాజమహేంద్రవరంలో శుక్రవారం పర్యటించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన  మాట్లాడుతూ ‘నన్ను రక్షించాల్సిన బాధ్యత మీదే’ అని పదేపదే అనడంతో ప్రజల్లో అసహనం వ్యక్తమయ్యింది. పింఛన్లు అందిస్తూనే ఉంటామని, పసుపు–కుంకుమ పథకం రానున్న ఐదేళ్లలో మూడుసార్లు అందిస్తానని ప్రకటించారు.

రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు అన్నదాత సుఖీభవ పథకం, వెనుకబడిన తరగుతుల కోసం ప్రత్యేక బీసీ బ్యాంకు ఏర్పాటు, కుళాయిల ద్వారా నాణ్యమైన శుద్ధి నీళ్లు సరఫరా చేస్తామని, ప్రతి కుటుంబానికి రూ.2లక్షల మేరకు ఆదాయం సమకూరే విధంగా పని కల్పిస్తామన్నారు. ఆడపిల్లల పెళ్లికి రూ.1లక్ష ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.  కాపులకు ఐదుశాతం రిజర్వేషన్‌ని అమలు చేస్తామన్నారు. అయితే  హామీలు ఇచ్చినా ప్రజల నుంచి ప్రతి స్పందన కనిపించకపోవడంతో టీడీపీ నేతలు నిరాశకు గురయ్యారు. అంతకు ముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  చంద్రబాబు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
Advertisement