Sakshi News home page

సీఎంగా చంద్రబాబు విఫలం: బీజేపీ

Published Wed, Mar 21 2018 2:23 PM

Chandrababu Fail as a CM says BJP Leader - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వైఫల్యాలను తమపై వేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీపై తాము ఎప్పడు దాడి చేయలేదని.. వాళ్లే మాపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. ఎన్నికలప్పుడు 1500 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కాపులు, మత్య్సకారులు, బీసీలను మభ్యపెడుతున్నారని తెలిపారు. రైతులు, నిరుద్యోగుల సహా అందరినీ బాబు మోసం చేశారని, ఆయన వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Advertisement
Advertisement