అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు 

1 Oct, 2019 10:55 IST|Sakshi

శివమొగ్గ : ఒకవైపు అనర్హత, మరోవైపు కోర్టులో విచారణతో తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని మథనపడుతున్న అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభయమిచ్చారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని యడియూరప్ప తెలిపారు. సోమవారం జిల్లాలోని శికారిపుర పట్టణంలో నిర్వహించిన జనతాదర్శన్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమై ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు అంగీకరించారని చెప్పారు. అనర్హత ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ఇంచార్జ్‌లను నియమించి అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.  

పార్టీ నిర్ణయానికి కట్టుబడాలి 
అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించడానికి సహకరించాలని సూచించారు. పారీ్టలోని కీలకనేతలకు సముచిత స్థానం కలి్ప స్తామని ఇదే విషయంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతలకు నిగమ మండళి స్థానాలు కట్టబెడతామని హామీ ఇచ్చారు.  

కాంగ్రెస్‌ గెలిస్తే కరెక్టా?  
ఈవీఎంల ట్యాంపరింగ్‌ అవుతాయేమోనని మాజీ సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేయడాన్ని యడియూరప్ప తప్పుపట్టారు. కాంగ్రెస్‌ గెలిస్తే సరిగ్గా పనిచేసే ఈవీఎంలు బీజేపీ గెలిచినపుడు మాత్రం ఎలా ట్యాంపరింగ్‌ అవుతాయో సిద్దరామయ్యే చెప్పాలని కోరారు. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఇక ఎవరిదారి వారిదే అని ఉమేశ్‌ కత్తి చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే ఆయన భేటీ అయి చర్చిస్తానని చెప్పారు.  

చకచకా శివమొగ్గ ఎయిర్‌పోర్టు  
శివమొగ్గ నగర శివార్లలోని సోనగానహళ్లిలో నిలిచిపోయిన విమానాశ్రయ నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామంటూ సీఎం తెలిపారు. అతి త్వరలో విమానాశ్రయ పనులను పునఃప్రారంభించనున్నామని అందుకోసం రూ.45 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. పదినెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని విమానాశ్రయంతో పాటు జిల్లా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు స్థాపనపై కూడా దృష్టి సారించామన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’

‘థ్యాంక్స్‌ శంకర్‌.. మోదీని బాగా వెనుకేసుకొచ్చారు’

అబ్దుల్‌ భట్‌ బ్రాహ్మణుడే: ఉండవల్లి

హోరెత్తిన హుజూర్‌నగర్‌

హుజూర్‌ బరిలో భారీగా నామినేషన్లు

అభివృద్ధి చేసిందే కాంగ్రెస్‌

మాటల కూటమి.. పోటీ సెపరేట్‌

‘మహా’ పొత్తు కుదిరింది 

‘30 వేల మెజారిటీ రాకుంటే.. ఏ శిక్షకైనా సిద్ధం’

‘ఉత్తమ్‌ స్థానికేతరుడు.. చిత్తుగా ఓడించండి’

‘హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ పయ్యావుల’

బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్‌

బీజేపీ అభ్యర్థిగా కూరగాయల విక్రేత కొడుకు

చిదంబరానికి చుక్కెదురు

ఊహించని షాక్‌.. టికెట్‌ ఇచ్చినా పార్టీ మారారు

నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

ఆ కుటుంబం నుంచి తొలి వ్యక్తి.. 56 ఏళ్ల తరువాత బరిలో

పీఓకేను స్వాధీనం చేసుకుంటాం

తిండి కూడా పెట్టకుండా వేధించారు

కాంగ్రెస్, జనసేన నేతలు బీజేపీలో చేరిక

బాబు పాపాలే విద్యుత్‌ శాఖకు శాపం 

మాదిగలకు వాటా దక్కాల్సిందే

ప్రతి స్కీం ఓ స్కాం: లక్ష్మణ్‌

హుజూర్‌నగర్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం

ఉప ఎన్నికలో మద్దతివ్వండి

హుజూర్‌నగర్‌లో ఇక లాభ నష్టాల ‘గణితం’

డీజేఎస్‌ కార్యాలయం వద్ద  పోలీసులు మొహరింపు 

ఎన్నికలపై మోదీ, షా కీలక భేటీ

అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం