కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జగన్‌ సీరియస్‌

25 Jun, 2019 12:33 IST|Sakshi

రిపీట్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఏ పార్టీ నాయకులున్నా విడిచిపెట్టొద్దు

ఈ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించాలి

కలెక్టర్ల రెండో రోజు సదస్సులో ఏపీ సీఎం

సాక్షి, అమరావతి: కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. ఈ రాకెట్‌లో వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి.

బెల్ట్‌ షాప్స్‌ పూర్తిగా ఎత్తేయాల్సిందే..
అక్టోబర్‌ 1 నాటికి బెల్లుషాపులు పూర్తిగా ఎత్తేయాల్సిందే. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలి. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండవద్దు. దాబాల్లో మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. భద్రతా నిబంధనలు, నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలి. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలి. విజయవాడ ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలి. దీనిపై సబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేయండి. గంజాయి సాగుని పూర్తిగా నియంత్రించాలి. గంజాయి నిర్మూలన దిశగా ఆగస్టులో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించాలి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించి గంజాయి సాగు నుంచి దూరం చేయాలి.

పోలవరం నిర్వాసితుల కోసం..
పోలవరం నిర్వాసితుల సమస్య పై శాశ్వతంగా గ్రీవెన్సు సెల్ పెట్టాలని నిర్ణయించాం. ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా ఇందుకోసం కేటాయించాం. నిర్వాసితుల ప్రతి సమస్యను వేగంగా పరిష్కరించాలి. పోలవరం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్. ఆర్థికంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోంది. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలకు తాగునీరు అందించలేకపోతే చాలా సమస్యలొస్తాయి’ అని వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

ప్రశ్నించే వారుండొద్దా...?

ఎన్నికల వరకే రాజకీయాలు

వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం వస్తుంది..   

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం

‘బాబు.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చెయ్‌’

కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు

హామీలను మించి లబ్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌