రాత్రికి రాత్రే ఓటింగ్‌ శాతం ఎలా పెరిగింది?

19 Dec, 2018 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గడిబిడి జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌ ఓట్లకు తేడా వచ్చిందన్నారు. వేల సంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాత్రికిరాత్రే 11 శాతం ఓటింగ్‌ ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి పిరాయించిన దామోదర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దామోదర రెడ్డి ఫిరాయింపుకు సంబంధించి పూర్తి వివరాలు మండలి చైర్మన్‌కు అందించామన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన చైర్మన్‌..తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని నాలుగేళ్లుగా ఫిర్యాదు చేసిన కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను నాలుగున్నరేళ్లు మంత్రిగా కొనసాగించారని విమర్శించారు. కేసీఆర్‌కి శిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు. 

గెలుపు ఓటమిలు సహజం
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని షబ్బీర్‌ అలీ అన్నారు. ఓడిపోయినంత మాత్రన ఇంట్లో ఉండమని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీలపై అప్పుడే కేసీఆర్‌ మాటమార్చారని దుయ్యబట్టారు. మూడు రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని చెప్పారు. కాంగ్రెస్‌ క్రెడిబిలిటీ ఏంటో.. కేసీఆర్‌ క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎందుకు పిటిషన్‌ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతో వేయి మంది బీసీ సర్పంచ్‌లు, 9వేల మంది వార్డ్‌ మెంబర్‌లు నష్టపోయారని ఆరోపించారు. బీసీలు మెల్కొని ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు