గుర్రంపై కూర్చుని ఖడ్గమెత్తిన హీరో

4 Nov, 2018 05:36 IST|Sakshi
ఎంపీ శశిథరూర్‌

మోదీపై థరూర్‌ మరో వ్యాఖ్య

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీని హేళన చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వ్యాఖ్యలు చేశారు. తనకు అన్ని తెలుసని చెప్పుకునే మోదీ ‘తెల్లని గుర్రంపై కూర్చుని  గాల్లోకి ఖడ్గాన్ని ఎత్తిన హీరో’ అని పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలో ఒక్క వ్యక్తి(మోదీ) చేతిలోనే పాలన అంతా నడుస్తోందని అన్నారు. ‘మోదీ ప్రభుత్వానిది ఏక వ్యక్తి పాలన. మోదీ∙చెప్పిన ప్రతిదానికీ అంతా తలూపుతున్నారు. చరిత్రలో ప్రధాని కార్యాలయంలో పాలన ఇంతగా ఎప్పుడూ కేంద్రీకృతం కాలేదు. ప్రతి నిర్ణయాన్ని ప్రధాని కార్యాలయమే తీసుకుంటోంది. అనుమతి కోసం ప్రతి దస్త్రాన్ని అక్కడికే పంపుతున్నారు’ అని అన్నారు. మరోవైపు, ‘మోదీ శివలింగంపై తేలు వంటి వారు’ అంటూ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు కోర్టుకెక్కారు. అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ బబ్బర్‌ పరువు నష్టం కేసు వేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు